ఆస్తి పన్ను బకాయిల వసూళ్లపై ప్రత్యేక శ్రద్ధ చూపండి - డిప్యూటీ కమిషనర్ చెన్నుడు
నెల్లూరు, కార్పొరేషన్, మేజర్ న్యూస్ : నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ చెన్నుడు మంగళవారం రెవిన్యూ సిబ్బందితో సమీక్ష సమావేశాన్ని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో నిర్వహించారు.
ఈ సమావేశంలో పరిపాలనా కార్యదర్శులు, రెవెన్యూ సిబ్బంది కార్పొరేషన్ కు చెల్లించవలసిన బకాయిల వసూలు కొరకు ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. అలాగే రెవిన్యూ ఇన్స్పెక్టర్లు ప్రతిరోజు రెవెన్యూ వసూళ్లను పర్యవేక్షించవలసినగా ఆదేశించారు. నగరంలో నూతనంగా నిర్మించిన కొత్త భవనములు, అదనపు అంతస్తులు నిర్మించిన భవనములు, ఖాళీ స్థలములను గుర్తించి ఆస్తి పన్ను పరిధిలోకి తీసుకురావాల్సిందిగా ఆదేశించారు. ఈ కార్యక్రమంలో టి.పి.ఆర్.ఓ. వాసు బాబు, రెవిన్యూ ఆఫీసర్లు సమద్, శ్రీనివాసులు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, పరిపాలనా కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.