విద్యార్థులకు గాయిటర్ పరీక్షలు
బలిజిపేట, అక్టోబర్ 6, మేజర్ న్యూస్ : మండలంలో గళావిల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులు బి.రేవతి, జి రిషి కుమార్ ఆధ్వర్యంలో విద్యార్థులకు గాయిటర్ పరీక్షలు చేశారు. జాతీయ అయోడిన్ లోపల రుగ్మతల నియంత్రణ కార్యక్రమంలో భాగంగా నారం నాయుడు వలస జిల్లా పరిషత్ ఉన్నత పాఠశా విద్యార్థులకు, ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు పరీక్షలు చేశారు. అలాగే విద్యార్థులు ఇంటి వద్ద ఉపయోగించిన ఉప్పును సేకరించి పరీక్షల కోసంజిల్లా కేంద్రానికి పంపించినట్లు వైద్యాధికారులు తెలియజేశారు. కొంతమంది విద్యార్థుల మూత్ర నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం జిల్లా కేంద్రానికి పంపినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఈవో నరసింహులు, హెచ్. ఎస్.వెంకటరమణ, హెచ్. వి.చిన్నతల్లి ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.