పేకాట స్థావరంపై అశ్వరావుపేట పోలీసుల మెరుపు దాడి
పేకాట స్థావరంపై అశ్వరావుపేట పోలీసుల మెరుపు దాడి
పేకాట స్థావరంపై అశ్వరావుపేట పోలీసులు మంగళవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో దాడి చేశారు. ఎస్ఐ టీ యయాతీ రాజు కథనం ప్రకారం అశ్వారావుపేట మండలంలోని నారం వారి గూడెం కాలనీ గ్రామ శివారులో చెరువు దగ్గర గల ఖాళీ స్థలంలో పేకాట ఆడుతున్నట్లు అందిన విశ్వాసనీయ సమాచారం మేరకు దాడి చేసి 6 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వారి వద్ద నుంచి 52 పేక ముక్కలు, రూ.8100 నగదు , 4 మోటార్ సైకిల్ లు మరియు 5 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
సూర్య ప్రతినిధి మునీర్ అశ్వారావుపేట