BREAKING
విజయవాడ ఉత్సవ్ 2.0, దసరా వేడుకలకు కేంద్ర రైల్వే మంత్రికి ఆహ్వానం బ్రస్సెల్స్ విమానాశ్రయంలో శుక్రవారం విమానాల రద్దుకు ఏర్పాట్లు ఆర్టీసీ బస్సు–టాటా మ్యాజిక్ ఢీ గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు: సీఎం చంద్రబాబుకు ఆహ్వానం పలికిన ఆలయ ధర్మకర్తల మండలి, అధికారులు! పల్లె పల్లెకు పొన్నం అన్న - పల్లె పల్లెలో ప్రజాపాలనపరివేద గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన మంత్రి పొన్నం ప్రభాకర్ పనీర్ vs సోయా చంక్స్.. బరువు తగ్గాలనుకునేవారికి ఈ రెండింటిలో ఏది ఎక్కువ ప్రయోజనకరమో తెలుసా? విజయ మహిళా మండలికి స్వచ్ఛత ఆంధ్ర అవార్డు మానవత్వం చాటుకున్న శాలపాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కవ్వాల్ అడవుల్లో విద్యార్థుల సందడి భారతీయ జ్ఞాన సంపదపై అవగాహన కార్యక్రమాలు రైతులకు రాయితీపై అందుబాటులో శనగ విత్తనాలు బాక్సాఫీస్ వద్ద దృశ్యం 3 సునామీ.. ఐదో రోజుకే 220 కోట్ల మార్క్ దాటేసిన అజయ్ దేవగన్ చిత్రం! ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియ వెంటనే పూర్తి చేయాలి. : రంగారెడ్డి డీఎంహెచ్‌ఓగా డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి

హర్ ఘర్ జల్‌పై ప్రజలకు అవగాహన

Select Suryaa Now
హర్ ఘర్ జల్‌పై ప్రజలకు అవగాహన

సూర్య ఎలిగేడు ; మండలం ర్యాకల్ దేవ్‌పల్లి గ్రామంలో హర్ ఘర్ జల్ కార్యక్రమాన్ని మంగళవారం గ్రామ సర్పంచ్ మద్దెల రమాదేవి సంపత్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు సురక్షితమైన తాగునీటి వినియోగంపై అవగాహన కల్పించారు.ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ఉండేలా చూసుకోవడం, నల్లా కనెక్షన్లను సక్రమంగా వినియోగించడం, తాగునీటి వృథాను అరికట్టడం వంటి అంశాలను ప్రజలకు వివరించారు. గ్రామంలోని వాటర్ ట్యాంకులను క్రమం తప్పకుండా శుభ్రపరచడంతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, నీరు కలుషితం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.సురక్షితమైన తాగునీటిని వినియోగించడం ద్వారా అనేక అనారోగ్య సమస్యలను నివారించవచ్చని సర్పంచ్ మద్దెల రమాదేవి సంపత్ తెలిపారు. ప్రతి కుటుంబం నీటి విషయంలో అప్రమత్తంగా ఉండాలని, గ్రామంలోని ప్రతి ఇంటికి స్వచ్ఛమైన, సురక్షితమైన తాగునీరు అందేలా అవసరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి కుక్క అశోక్, వాటర్ సభ్యులు సతీష్, గ్రామపంచాయతీ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.