నిత్యవసర ధరలకు కళ్లెం వేయాలి.
పామూరు, మేజర్ న్యూస్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన నిత్యావసర వస్తువుల ధరలను తక్షణమే తగ్గించాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సీపీఐ పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. పట్టణంలోని గుజ్జుల యల్లమందరెడ్డి సీపీఐ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీపీఐ మండల కార్యదర్శి పాలపర్తి మస్తాన్‌రావు మాట్లాడుతూ కందిపప్పు, వంటనూనె, బియ్యం, కూరగాయలు, ఇతర నిత్యావసర వస్తువుల ధరలు సామాన్యులకు అందనంత ఎత్తుకు చేరాయని అన్నారు. పేద, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని విమర్శించారు. కార్పొరేట్ శక్తులు, దళారులకు లాభం చేకూర్చేలా ప్రభుత్వ విధానాలు ఉన్నాయని ఆరోపించారు. పెరిగిన ధరలను వెంటనే తగ్గించి రేషన్ షాపుల ద్వారా సబ్సిడీపై నిత్యావసర వస్తువులను అందించాలని డిమాండ్ చేశారు. సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పోతల ప్రభాకర్ మాట్లాడుతూ ధరల నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సీపీఐ పూర్తిగా సిద్ధంగా ఉందన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి సీపీఐతోనే సాధ్యమని, ప్రజలు పార్టీని ఆదరించాలని కోరారు. కార్యక్రమంలో సీపీఐ నియోజకవర్గ సహాయ కార్యదర్శి వజ్రాల సుబ్బారావు, కిషన్‌సింగ్, దేవకుమార్ తదితరులు పాల్గొన్నారు.