రూ 450 కోట్లు అభివృద్ధి,రూ 17 కోట్లు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా నిరుపేదలకు వైద్యసహాయం
ఏలూరు/నూజివీడు, మేజర్ న్యూస్:నూజివీడు గ్రామం మంగళవారం కొంపెల్లి కృష్ణకుమారి మాజీ కౌన్సిలరు స్వగృహంలో నియోజకవర్గం కూటమి మహిళామణులు ఇటీవల మాదాల సునీత, మరి కొంత మంది వ్యక్తులు మంత్రి కొలుసు పార్థసారథిపై చేసిన తప్పుడు ఆరోపణలుపై కూటమి మహిళామణులు ఘాటుగా ఖండించారు.ఈ సందర్భంగా కూటమి మహిళామణులు మాట్లాడుతూ ఎన్నడూ చూడని అభివృద్ధి, సంక్షేమం కేవలం రెండు సంవత్సరాలలో మంత్రి కొలుసు పార్థసారథి చేసి చూపించారన్నారు. మంత్రి పేరును చెడగొట్టి, కుట్ర రాజకీయాలు చేస్తున్నారని, ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ఎన్ని తప్పుడు ఆరోపణలు చేసినా నూజివీడు అభివృద్ధి, సంక్షేమం మంత్రి కొలుసు పార్థసారథితోనే సాధ్యమన్నారు.ఎప్పుడు స్థానిక సంస్థలు ఎన్నికలు ఎప్పుడూ వస్తాయా అని ప్రజలు ఎదురు చూస్తున్నారని, మరలా మంత్రి కొలుసు పార్థసారథి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వానికి బ్రహ్మరథం పట్టి, ఇటువంటి విమర్శలకు కాలం చెల్లుతుందని అన్నారు. ఎన్నడూ చూడని అభివృద్ధి, సంక్షేమం కేవలం రెండేళ్లలో చేసి చూపించిన మంత్రి కొలుసు పార్థసారథిని, మాదాల సునీత, మరి కొంతమంది వ్యక్తులు తప్పుడు ఆరోపణలను ప్రజలు నమ్మేస్థితిలో లేరని అన్నారు. నూజివీడు నియోజకవర్గంలో గడిచిన రెండున్నర ఏండ్లలో రూ 450 కోట్లు అభివృద్ధి,రూ 17 కోట్లు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా నిరుపేదలకు వైద్యసహాయం అందించారన్నారు. బహిరంగ సభపెట్టి పత్రికా ముఖంగా మంత్రి కొలుసు పార్థసారథికి బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేదంటే నియోజకవర్గం మహిళామణులు తీసుకునే చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలరు కొంపెల్లి కృష్ణకుమారి, యనమదల సృజనా చౌదరి యంయం.పాలెం పిఏసిఎస్ అధ్యక్షురాలు, కోట దేవకీదేవి తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు, వేమూరి లక్ష్మీగౌరీశ్వరి మహిళా నాయకురాలు, కుందేటి కస్తూరి ముసునూరు మండలం తెలుగు మహిళా అధ్యక్షురాలు, యార్లగడ్డ రాధాకుమారి, నెట్ల ఉమా మహేశ్వరి, తదితర మహిళా మణులు, మరియు కూటమి నాయకులు, స్థానిక ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్ :ప్రసాద్.నూజివీడు. ఏలూరు జిల్లా