గూడూరు నియోజకవర్గంలో ఉమ్మడి నెల్లూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్ పర్సన్ శ్రీమతి మేకపాటి శాంతి కుమారి విస్తృత పర్యటన
గూడూరు నియోజకవర్గంలో ఉమ్మడి నెల్లూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్ పర్సన్ శాంతి కుమారి గారు సుడిగాలి పర్యటన
గూడూరు, మేజర్ న్యూస్ : గూడూరు నియోజకవర్గంలోని గూడూరు,చిల్లకూరు, కోట,వాకాడు,చిట్టమూరు,చెన్నూరు గ్రంథాలయాలను మంగళవారం ఉమ్మడి నెల్లూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్ పర్సన్ శ్రీమతి మేకపాటి శాంతికుమారి గారు సందర్శించారు. గ్రంధాలయాలను పలు రికార్డులను గ్రంథాలయ పరిసరాలను ఆమె పరిశీలించారు. గ్రంధాలయ భవనాల స్థితిగతులు, పాఠకులకు కావాల్సిన సౌకర్యాలు, గ్రంథాలయంలో ఉండేటువంటి బుక్స్ వివరాలు స్థానిక సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఉమ్మడి నెల్లూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్ పర్సన్ శ్రీమతి మేకపాటి శాంతి కుమారి గారు మాట్లాడుతూ అన్ని గ్రంథాలయాలను సందర్శించి కావాల్సిన సౌకర్యాలు అన్నీ కూడా ఐడెంటిఫై చేయడం జరుగుతుందని, మరమ్మతులు చేయాల్సిన గ్రంథాలయాలకు మరమ్మతులు చేయించడం, పూర్తిగా శిథిలా వ్యవస్థకు చేరుకున్న గ్రంధాలయ భవనాలను తొలగించి నూతన భవనాలను నిర్మించడం, తాత్కాలికంగా అద్దె భవనాల్లో ఏర్పాటు చేయడం, రీడర్స్ కు కావలసినటువంటి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి కాంపిటేటివ్ బుక్స్ ఏర్పాటు చేసి ప్రతి గ్రంథాలయాన్ని ఇప్పుడున్న టెక్నాలజీకి అనుకూలంగా అభివృద్ధి చేసే విధంగా కృషి చేస్తామని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు, ఐటీ మరియు విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారు మరియు రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు గారి సహకారంతో, స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలు అందరి భాగస్వామ్యంతో గ్రంథాలయాల అభివృద్ధి చేయడానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ముందు గ్రంథాలయ పరిస్థితులు తెలుసుకోవడానికి ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా పర్యటించడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.