BREAKING
శ్రీ కోటదుర్గ ఆలయం లో గోడ పత్రిక విడుదల కొత్తపల్లి,రావుపల్లి గ్రామాల అంగన్వాడీ వర్కర్లకు సత్కారం మండల విద్యాశాఖ అధికారులకు ఒకరోజు అవగాహన శిక్షణ కార్యక్రమం నిర్వహించిన డీఈవో స్థానిక సంస్థల ఎన్నికలకు స్ట్రాంగ్ రూమ్ పరిశీలన తెగిపోయిన చేతికి మళ్లీ ప్రాణం… పీఎంశ్రీ పాఠశాలల్లో.. ప్రత్యేక అతిథి విద్యాబోధకుల నియామకం ఆటో ద్విచక్ర వాహనం ఢీ ఒకరికి గాయాలు.... చిగురుకోట జడ్పీ హైస్కూల్ ను పరిశీలించిన ఎస్ఎంసి చైర్మన్ దండే లక్ష్మి పాలకొండ శ్రీ కోట దుర్గమ్మ ఉత్సవ ఏర్పాట్ల పరిశీలన కనిగిరి చేరిన బ్యాలట్ బాక్స్ లు కోర్టు సినిమా హీరోయిన్ శ్రీదేవి కొత్త చిత్రం హైకూ ట్రైలర్ రిలీజ్.. అక్టోబర్ 23న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్! జోగింపేట గ్రామంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించిన ఏవో ఎస్ అవినాష్ అయోడిన్ లోపంతో పిల్లల ఎదుగుదలపై ప్రభావం శ్రీ కోటదుర్గమ్మ ఆలయంలో వరుణయాగం వరిలో ఎద పద్ధతితో సాగు ఖర్చు తగ్గుతుంది ... ఏవో ఎస్ అవినాష్.

ప్రశాంత వాతావరణంలో దసరా పండుగ నిర్వహణకు పోలీసుల సన్నద్ధత..సిబ్బందికి పలు కీలక సూచనలు చేసిన వన్‌టౌన్‌ సీఐ టి.వి. కొండారెడ్డి

Select Suryaa Now
ప్రశాంత వాతావరణంలో దసరా పండుగ నిర్వహణకు పోలీసుల సన్నద్ధత..సిబ్బందికి పలు కీలక సూచనలు చేసిన వన్‌టౌన్‌ సీఐ టి.వి. కొండారెడ్డి

ప్రొద్దుటూరు అర్బన్ మేజర్ న్యూస్:

రానున్న దసరా పండుగ వేడుకలు ప్రశాంతంగా, సజావుగా జరిగేలా ప్రొద్దుటూరు వన్‌టౌన్‌ పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్, ఐపీఎస్‌ ఆదేశాల మేరకు వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో పోలీసు సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. వన్‌టౌన్‌ సీఐ టి.వి. కొండారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో దసరా వేడుకల సందర్భంగా తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై సిబ్బందికి దిశానిర్దేశం చేశారు.

దసరా పండుగ సందర్భంగా పట్టణంలోని ఆలయాలు, ప్రధాన కూడళ్లు, మార్కెట్‌ ప్రాంతాలు, ప్రజలు అధికంగా గుమిగూడే ప్రదేశాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు. పండుగ రోజుల్లో ప్రజల రాకపోకలు పెరిగే అవకాశం ఉన్నందున ట్రాఫిక్‌ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని సిబ్బందికి ఆదేశించారు. అదేవిధంగా బందోబస్తు విధుల్లో ఉన్న సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులపై నిఘా ఉంచాలని సూచించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఎలాంటి పరిస్థితులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని తెలిపారు. ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్‌ నియంత్రణ, భద్రతా చర్యలను సమన్వయంతో చేపట్టాలని సీఐ కొండారెడ్డి సూచించారు. పండుగ వేడుకల సమయంలో ఏవైనా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని స్పష్టం చేశారు.

దసరా వేడుకలను ప్రజలు ప్రశాంతంగా, ఆనందంగా జరుపుకునేలా పోలీసు శాఖ తరఫున అవసరమైన అన్ని భద్రతా చర్యలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.

-ఎ ప్రతాప్ కుమార్ ప్రొద్దుటూరు అర్బన్ కడప జిల్లా