మరోసారి పెరగనున్న టెలికాం రీఛార్జ్ ధరలు
దేశీయ టెలికాం రంగంలో పోటీ తగ్గడంతో, రాబోయే 4-5 నెలల్లో మొబైల్ రీఛార్జ్ ప్లాన్ల ధరలు మరింత ప్రియం కానున్నాయి. 5G నెట్‌వర్క్ విస్తరణ, నిర్వహణ ఖర్చులు పెరగడంతో జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా వంటి టెలికాం సంస్థలు రీఛార్జ్ ధరలను 12% నుంచి 15% వరకు పెంచేందుకు సిద్ధమవుతున్నాయి. వినియోగదారుడి నుంచి వచ్చే సగటు ఆదాయాన్ని (ARPU) పెంచుకోవడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ టారిఫ్ పెంపు సామాన్యులపై అదనపు ఆర్థిక భారం మోపనుంది