ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు, విలేజ్ హెల్త్ క్లినిక్ భవన నిర్మాణాలు
ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు, విలేజ్ హెల్త్ క్లినిక్ భవన నిర్మాణాలు ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. కృష్ణాజిల్లా నుంచి మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు వర్చువల్ విధానంలో అన్ని జిల్లాలలో పూర్తయిన భవనాలను ఆయన ప్రారంభించారు. 21 భవనాలకు శిలాఫలకాలను జిల్లా కలెక్టర్ వాసుదేవ వినోద్ కుమార్ తో కలిసి బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు ఆవిష్కరించారు. కార్యక్రమంలో బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ దుర్గాప్రసాద్, సగర, ఉప్పర కార్పొరేషన్ డైరెక్టర్ సుబ్బారావు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ ఎస్ విజయమ్మ, డిసిహెచ్ఎస్ డాక్టర్ పద్మావతి, డిప్యూటీ డిఎం హెచ్ ఓ సోమ్లా నాయక్ తదితరులు పాల్గొన్నారు.