BREAKING
అద్దంకిలో ఈనెల 9న ప్రజాస్వామ్య ఎన్నికల ర్యాలీ. ఉద్యోగుల సంక్షేమానికి సింగరేణి సంస్థ పెద్దపీట 2450 మంది కి సీఎం రిలీఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే బి.ఎన్ విజ్ఞాన్ ఉన్నత పాఠశాలలో ‘సేవా సంకల్ప్ అభియాన్’ పోటీలు ఇంటి ముంగిట అక్షరం... ఉమ జీవితంలో వెలుగుల విప్లవం! భూ సేకరణ పెండింగ్‌ అంశాలను త్వరగా పరిష్కరించాలి జలాంతర్గాముల తయారీకి అండూరిల్‌తో భారీ ఒప్పందం కడప అమీన్‌పీర్ దర్గా ఉర్సుకు సీఎం చంద్రబాబుకు ఆహ్వానం పండు మాస్టర్ ఆరోగ్య పరిస్థితిపై లేటెస్ట్ అప్‌డేట్.. కోలుకుంటున్న వైనంపై ఎమోషనల్ వీడియో వైరల్ ఎస్సీ భూముల జోలికొస్తే చర్యలు తప్పవు ఆస్తి పన్ను బకాయిల వసూళ్లపై ప్రత్యేక శ్రద్ధ చూపండి - డిప్యూటీ కమిషనర్ చెన్నుడు కుమారుడి జ్ఞాపకార్థం బధిరుల పాఠశాలలో సేవా కార్యక్రమం విద్యార్థులకు గాయిటర్ పరీక్షలు రెండు రోజులు విద్యుత్ సరఫరాకు అంతరాయం.. ప్రజాదర్బార్ తో సమస్యలు పరిష్కారం

నారాయణస్వామి దేవస్థానంలో వైభవంగా వరుణయాగం

Select Suryaa Now
నారాయణస్వామి దేవస్థానంలో వైభవంగా వరుణయాగం

సిఎస్ పురం,మేజర్ న్యూస్: ప్రసిద్ధిగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రం మిట్టపాలెం నారాయణస్వామి దేవస్థానం నందు రాష్ట్రప్రభుత్వం దేవాదాయశాఖ సూచనల మేరకు మంగళవారం మహావరుణయాగం పూజలు పూర్ణాహుతి, విశేషపూజలను అత్యంత వైభవంగా నిర్వహించారు.ఈసందర్భంగా దేవస్థానం కార్యనిర్వాహణాధికారి శ్రీగిరిరాజ నరసింహబాబు,ధర్మకర్త చినఆదినారాయణ అధ్వర్యంలో నారాయణస్వామిని ఇతర దేవతామూర్తులను పట్టువస్త్రాలు పూలమాలలతో అలంకరణ చేసి పూజలను దేవస్థానం ప్రధాన అర్చకులు యం.ప్రసాదుశర్మ అధ్వర్యంలో నిర్వహించి తదుపరి తీవ్రవర్షాభావ పరిస్థితుల వలన వర్షాలు కురిసి ప్రజలకు పశువులు జీవాలకు ఇబ్బందులు లేకుండా ఉండాలని దేవస్థానం అధ్వర్యంలో ప్రత్యేకంగా అలంకరించిన మండపం నందు పీఠంపై నారాయణస్వామి పటాన్ని నెలకొల్పి కలశస్థాపన చేసి వేదపండితులు ప్రత్యేకంగా నీటిలో కూర్చుని వేదమంత్రాలతో మహావరుణయాగం అదేవిధంగా హోమపూజలు నిర్వహించి అత్యంత వైభవంగా పూర్ణాహుతి నిర్వహించి నైవేద్యం సమర్పించి తీర్థప్రసాదాలు అందజేశారు.ఈసందర్భంగా  పలువురు నాయకులు భక్తులు పాల్గొని స్వామివారికి పూజలుచేసి మహా వరుణయాగ పూజల్లో పాల్గొన్నారు.ఈకార్యక్రమంలో దేవస్థానం కార్యనిర్వాహణాధికారి శ్రీగిరిరాజు నరసింహబాబు,ధర్మకర్త కె.చినఆదినారాయణ,ప్రభుత్వ కనీసవేతనాల సలహామండలి సభ్యులు డాక్టర్ బొమ్మనబోయిన వెంగయ్య,మండల రెవెన్యూ సీనియర్ అసిస్టెంట్ పద్మనాభం,ఒంగోలు పార్లమెంట్ టిడిపి కార్యనిర్వాహక కార్యదర్శి యన్.సి.మాలకొండయ్య, మండల సొసైటీ చైర్మన్ చెరుకుపల్లె వెంకటరెడ్డి,చావాసుబ్బయ్య, టి.లక్ష్మీనారాయణ,కె.వెంకటకొండయ్య,డి.మోహనరెడ్డి,బత్తులపూర్ణ,కొండయ్య,వేదపండితులు, భక్తులు,దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు.