రెండు రోజులు విద్యుత్ సరఫరాకు అంతరాయం..
నరసన్నపేట: నరసన్నపేట పట్టణంలోని నేతాజీ వీధిలో పాత విద్యుత్ స్తంభాలు మార్పిడి చేయాలని ఇటీవల పట్టణ టిడిపి నేతలు ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి కి విజ్ఞప్తి చేశారు. స్పందించిన ఆయన పనులు నిర్వహించాలని విద్యుత్ శాఖ అధికారులకు ఆదేశించారు. ఈ మేరకు లైన్ల మార్పిడి పనులు చేపట్టనున్నందున రెండు రోజుల పాటు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. అక్టోబర్ 7 (బుధవారం), అక్టోబర్ 8 (గురువారం) తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు నేతాజీ వీధి, కోవెల వీధి, కొత్త వీధి ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఏపీడీసీఏల్ టెక్కలి డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఈ. నరసింహకుమార్ తెలిపారు. విద్యుత్ లైన్ల మార్పిడి పనులకు వినియోగదారులు సహకరించాలని విద్యుత్ శాఖ ఏఈ రామ్ చరణ్ గుప్త కోరారు. సంబంధిత ప్రాంతాల ప్రజలు ఈ విషయాన్ని గమనించి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. విద్యుత్ లైన్ల మార్పిడి పనులను మంగళవారం ప్రారంభించారు.