andhrapradesh
ప్రజాదర్బార్ తో సమస్యలు పరిష్కారం
- ఎమ్మెల్యే సతీమణి కూన ప్రమీల
ఆమదాలవలస: ప్రజాదర్బార్ తో ప్రజా సమస్యలను పరిష్కరించుకోవచ్చునని, సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు మేరకు ప్రతివారం ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆమదాలవలస ఎమ్మెల్యే, పియుసి కమిటీ చైర్మన్ కూన రవికుమార్ సతీమణి మాజీ ఎంపీపీ కూన ప్రమీల అన్నారు. టిడిపి కార్యాలయంలో మంగళవారం ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించి, ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ప్రజలు అందజేసిన దరఖాస్తులను పరిశీలించి వెంటనే ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కరిస్తామని తెలిపారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని భరోసా ఇచ్చారు. ప్రజా సమస్యలు తీర్చేందుకు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఎమ్మెల్యే రవికుమార్ ఉంటారని, ఏ సమస్య వచ్చినా నేరుగా వచ్చి తమ సమస్యలను విన్నవించుకోవచ్చనని అన్నారు. ప్రజా పాలన దిశగా కూటమి ప్రభుత్వం నిరంతరం పని చేస్తుందని తెలిపారు. ప్రజల నుండి వచ్చిన పలు వినతులు తెలుసుకొని సంబంధిత శాఖల అధికారులతో వెంటనే మాట్లాడి పరిష్కారం చూపాలని తెలిపారు. ముఖ్యంగా నియోజకవర్గంలో త్రాగునీరు, పారిశుధ్య, రోడ్లు, విద్యుత్, పింఛన్లు, గృహ నిర్మాణం వంటి సమస్యలపై ప్రత్యేకంగా వినతులు వచ్చాయని వాటిని ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కరిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ తమ్మినేని చంద్రశేఖర్, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ తమ్మినేని గీత, సనపల డిల్లేశ్వరరావు, గోండు రమణమూర్తి, బోయిన సునీత, కణితి విజయలక్ష్మీబాయి, బొడ్డేపల్లి గౌరీపతి, పి వి కే రాజు,తదితరులు పాల్గొన్నారు.