యుపీఎస్సీ సివిల్ సర్వీసెస్.. మెయిన్స్ పరీక్షలకు ఉచిత శిక్షణ...
ఈనెల 20 లోపు దరఖాస్తుల స్వీకరణకు గడువు.. అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలి.. బీసీసంక్షేమశాఖ జిల్లా అధికారిణి పి వెంకటలక్ష్మి...
నెల్లూరు/వేదాయపాలెం, మేజర్ న్యూస్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఉన్నతాధికారుల ఆదేశానుసారం నెల్లూరు జిల్లాలోని అర్హులైన వెనుకబడిన.. షెడ్యూల్.. ముస్లిం మైనారిటీ కులాలు.. షెడ్యూల్ తెగలకు చెందిన విద్యార్థినీ.. విద్యార్థులకు యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ.. మెయిన్స్ పరీక్షలకు సంబంధించి ఉచితంగా శిక్షణ ఇవ్వడం జరుగుతుందని బీసీ సంక్షేమ శాఖ జిల్లా అధికారిణి.. ఏపీ స్టడీ సర్కిల్ ప్రాంతీయ సంచాలకురాలు పి వెంకటలక్ష్మి తెలిపారు. ఈ మేరకు ఆమె అధికారికంగా విడుదల చేసిన ప్రకటనలోని వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లాలోని పైన తెలిపిన కులాలకు చెందినవారై.. అర్హత కలిగిన విద్యార్థులు ఈ నెల 20 లోపు నెల్లూరు నగరంలోని బీసీ స్టడీ సర్కిల్ కార్యాలయం నందు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులకు ఈనెల 27న రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆయా స్టడీ సర్కిల్ సెంటర్లలో సివిల్ సర్వీసెస్ సిలబస్ ఆధారంగా ఆబ్జెక్టివ్ బిట్ టైప్ లో స్క్రీనింగ్ టెస్ట్ (పరీక్ష) నిర్వహించనున్నట్లు తెలిపారు. స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా మెరిట్..రిజర్వేషన్ ప్రాతిపదికన 100 మంది అభ్యర్థులను ఎంపిక చేయడంతోపాటు విజయవాడలోని గొల్లపూడి ప్రాంతంలో ఉన్న బీసీ భవన్ నందు ఉచిత శిక్షణ తోపాటు భోజనం.. వసతి సౌకర్యాలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. అర్హత.. ఆసక్తి కలిగిన అభ్యర్థులు తమ పూర్తి బయోడేటా తోపాటు పదవ తరగతి.. డిగ్రీ మార్కుల జాబితా..కుల దృవీకరణ పత్రం..రూ1 లక్ష లోపు వార్షిక ఆదాయం కలిగిన తల్లిదండ్రుల ఆదాయ ధ్రువీకరణ పత్రం.. ఆధార్.. బ్యాంక్ పాస్ బుక్ జిరాక్స్.. రెండు పాస్ ఫోటో సైజ్ ఫోటోలు.. జతపరిచి ఈనెల 20 లోపు జిల్లా కేంద్రమైన నెల్లూరు నగరం.. ఆర్టీసీ బస్టాండ్ ప్రక్కన.. శోధన నగర్ పాత మీసేవ కేంద్రం లోని బీసీ స్టడీ సర్కిల్ జిల్లా ప్రాంతీయ కార్యాలయం నందు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు 9381554779..8019375443 నంబర్లను సంప్రదించాలని సూచించారు.