BREAKING
అద్దంకిలో ఈనెల 9న ప్రజాస్వామ్య ఎన్నికల ర్యాలీ. ఉద్యోగుల సంక్షేమానికి సింగరేణి సంస్థ పెద్దపీట 2450 మంది కి సీఎం రిలీఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే బి.ఎన్ విజ్ఞాన్ ఉన్నత పాఠశాలలో ‘సేవా సంకల్ప్ అభియాన్’ పోటీలు ఇంటి ముంగిట అక్షరం... ఉమ జీవితంలో వెలుగుల విప్లవం! భూ సేకరణ పెండింగ్‌ అంశాలను త్వరగా పరిష్కరించాలి జలాంతర్గాముల తయారీకి అండూరిల్‌తో భారీ ఒప్పందం కడప అమీన్‌పీర్ దర్గా ఉర్సుకు సీఎం చంద్రబాబుకు ఆహ్వానం పండు మాస్టర్ ఆరోగ్య పరిస్థితిపై లేటెస్ట్ అప్‌డేట్.. కోలుకుంటున్న వైనంపై ఎమోషనల్ వీడియో వైరల్ ఎస్సీ భూముల జోలికొస్తే చర్యలు తప్పవు ఆస్తి పన్ను బకాయిల వసూళ్లపై ప్రత్యేక శ్రద్ధ చూపండి - డిప్యూటీ కమిషనర్ చెన్నుడు కుమారుడి జ్ఞాపకార్థం బధిరుల పాఠశాలలో సేవా కార్యక్రమం విద్యార్థులకు గాయిటర్ పరీక్షలు రెండు రోజులు విద్యుత్ సరఫరాకు అంతరాయం.. ప్రజాదర్బార్ తో సమస్యలు పరిష్కారం

కోదండ రామునికి ఘనంగా ఘటాభిషేకం

Select Suryaa Now
కోదండ రామునికి ఘనంగా ఘటాభిషేకం

గూడూరు(చిల్లకూరు), మేజర్‌న్యూస్‌  :  చిల్లకూరు మండల పరిధిలోని తమ్మిన పట్నం గ్రామంలోని కోదండ రామ స్వామి దేవస్థానంలో ఆలయ కమిటీ చైర్మన్ మరియు కార్యనిర్వహణ అధికారి ఆధ్వర్యంలో శ్రీరామునికి ఘటాభిషేకం నిర్వహించారు. సోమవారం ఉదయం రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి, రైతులు పంటలు బాగా పండించుకుని, కరువు కాటకాలు లేకుండా రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ వరుణ యాగం,1008 కలిశాలతో స్వామి అమ్మవార్లకు అభిషేకాలు, సహస్ర ఘటాభిషేక మహోత్సవ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ కోట సతీష్ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు తమ్మినపట్నంలోని కోదండ రామస్వామి దేవస్థానంలో వరుణ యాగం నిర్వహించడం జరిగింది. వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు సమృద్ధిగా పండి రైతులు ప్రజలు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుతూ పూజా కార్యక్రమాలు నిర్వహించామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కార్యనిర్వహణ అధికారి గిరి కృష్ణ, పాలకమండలి సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.