BREAKING
గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న వ్యక్తి పై ఎన్ డి పి ఎస్ యాక్ట్ నిర్భంద ఉత్తర్వులు ఆశ వర్కర్ల డిమాండ్లను నెరవేర్చాలి ఏడుపాయల వన దుర్గామాతను దర్శించుకున్న గవర్నర్ ప్రెస్ సెక్రటరీ మామిండ్ల దశరథం తొంబై శాతం సబ్సిడీ తో స్ప్రింక్లర్స్ పంపిణీ స్వర్ణ గిరిలో కలుశ పంచామృత అభిషేకం* క్లీన్ ప్రొద్దుటూరుకు కెమెరాల నిఘాతో అడుగులు వసతులు కరువైన బస్టాండ్ లిటిల్ హార్ట్స్ హీరో మౌళి కొత్త చిత్రం.. దొంగ నా కొడుకు రిలీజ్ డేట్ లాక్! పిచ్చికుక్క సైర విహారం రెండేళ్ళ బాలుడితో సహా ఆరుగురికి గాయాలు క్లీన్ ప్రొద్దుటూరుకు కెమెరాల నిఘా అడుగులు శ్రీ కోటదుర్గ ఆలయం లో గోడ పత్రిక విడుదల కొత్తపల్లి,రావుపల్లి గ్రామాల అంగన్వాడీ వర్కర్లకు సత్కారం మండల విద్యాశాఖ అధికారులకు ఒకరోజు అవగాహన శిక్షణ కార్యక్రమం నిర్వహించిన డీఈవో స్థానిక సంస్థల ఎన్నికలకు స్ట్రాంగ్ రూమ్ పరిశీలన తెగిపోయిన చేతికి మళ్లీ ప్రాణం…

కడప నగరంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి విశేష పూజలు

Select Suryaa Now
కడప నగరంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి విశేష పూజలు

సుబ్రహ్మణ్యస్వామికి విశేష పూజలు

కడప నగరంలోని మహావీర్ సర్కిల్‌లో వెలసిన శ్రీ సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో మంగళవారం సందర్భంగా భక్తులు విశేష పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున స్వామివారికి పాలు, పండ్లు, పలహారాలతో పంచామృత అభిషేకం నిర్వహించారు.

అనంతరం అర్చకులు సందీప్ శర్మ ఆధ్వర్యంలో మూలవిరాట్ విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించి, దీపాలంకరణ సేవ, పుష్పాభిషేకం, అర్చన తదితర పూజా కార్యక్రమాలను నిర్వహించారు. స్వామివారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి పూజలు చేశారు.

విచ్చేసిన భక్తులకు ఆలయ నిర్వాహకులు తీర్థప్రసాదాలను అందజేశారు.

 కడప క్రైమ్ రిపోర్టర్, వేణు.