BREAKING
సైబర్ భద్రతపై అవగాహనే డిజిటల్ ప్రపంచానికి శ్రీరామరక్ష రూ 450 కోట్లు అభివృద్ధి,రూ 17 కోట్లు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా నిరుపేదలకు వైద్యసహాయం ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు కౌన్ బనేగా లక్పతి క్విజ్ పోటీలు ఆత్మవిశ్వాసంతో ఎదగాలి.. తరం మార్చే శక్తిగా యువతులు నిలవాలి మరోసారి పెరగనున్న టెలికాం రీఛార్జ్ ధరలు ఎల్ఓసి అందేసిన ప్రణవ్ నిత్యవసర ధరలకు కళ్లెం వేయాలి. షెడ్డు నిర్మాణపు నిధుల మంజూరుకై వినతి అర్హత కలిగిన ప్రతి ఓటరు పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా చర్యలు రాజన్న క్షేత్రానికి 'కృష్ణశిల' వైభవం రావాలి నలభై ఏళ్ల కల నెరవేరింది.. పల్లిపాడులో విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌ ప్రారంభం: కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి హర్ ఘర్ జల్‌పై ప్రజలకు అవగాహన ఆర్టీసీ కార్మికులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం సూర్యుడి కరెంట్‌తో విద్యుత్ బిల్లుకు చెక్ – ఏడీఈ డి. కృష్ణారెడ్డి రేషన్ షాపులను తనిఖీ చేసిన మండల తాసిల్దార్ మహమ్మద్ జియావుల్ హాక్

ప్రజా సమస్యలు గాలికొదిలిన రేవంత్ రెడ్డి

Select Suryaa Now
ప్రజా సమస్యలు గాలికొదిలిన రేవంత్ రెడ్డి

ప్రజా సమస్యలు గాలికొదిలిన రేవంత్ రెడ్డి

రూ.3.18 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం

ప్రజా సమస్యలను పట్టించుకోకుండా ‘ఫ్యూచర్ సిటీ’ పేరుతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారానికి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి విమర్శించారు. మంగళవారం తుక్కుగూడ,మంఖల్‌ డివిజన్‌ పరిధిలో రూ.3.18 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ఆమె శంకుస్థాపన చేశారు.రావిర్యాల ఓల్డ్‌ బ్రిడ్జి నుంచి సర్దార్‌నగర్‌ వరకు డ్రైనేజీ, సూర్యగిరి ఎల్లమ్మ దేవాలయం ముఖాద్వారాం నుంచి రావిర్యాల వరకు బీటీ, సీసీ రోడ్డు పనులతో పాటు ఓఆర్‌ఆర్‌ సర్వీస్‌ రోడ్డు నుంచి జన్నాయిగూడ వరకు రోడ్డు పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. పనులు పూర్తయితే స్థానిక ప్రజలు, ఆలయానికి వచ్చే భక్తులకు రవాణా, డ్రైనేజీ సమస్యలు తగ్గుతాయని అన్నారు.కేసీఆర్‌ హయాంలో మంజూరైన పలు అభివృద్ధి పనులను ప్రస్తుత ప్రభుత్వం నిలిపివేసిందని ఆరోపించిన సబితా ఇంద్రారెడ్డి, నిలిచిపోయిన పనులకు తిరిగి నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. మంజూరైన పనులను నాణ్యతా ప్రమాణాలతో నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని అధికారులను కోరారు. అనంతరం సూర్యగిరి ఎల్లమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు, ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

పాల జనార్దన్ :మేజర్ న్యూస్, మహేశ్వరం