సూర్యుడి కరెంట్‌తో విద్యుత్ బిల్లుకు చెక్ – ఏడీఈ డి. కృష్ణారెడ్డి
పామూరు, మేజర్ న్యూస్ : సేవా సేతు అభియాన్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం పట్టణంలోని ఆర్‌అండ్‌బీ స్థలంలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో సోలార్ విద్యుత్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏడీఈ డి. కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఇంటిపై సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా సౌర విద్యుత్‌ను వినియోగించుకుని విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించుకోవచ్చని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న రాయితీలు, బ్యాంకుల ద్వారా కల్పిస్తున్న రుణ సదుపాయాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు సంబంధించిన విధానం ప్రభుత్వ ప్రోత్సాహకాలు బ్యాంకు రుణ సదుపాయాలపై అధికారులు సోలార్ కంపెనీ వెండర్లు ప్రజలకు అవగాహన కల్పించారు. మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో సోలార్ ప్లాంట్ల నిర్మాణానికి పది మంది దరఖాస్తు చేసుకున్నారని ఏడీఈ తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సౌర విద్యుత్ వైపు అడుగులు వేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో ఏఈ జిలాని, బ్యాంకు అధికారులు, సోలార్ కంపెనీ వెండర్లు పాల్గొన్నారు.