BREAKING
నవ్వుల కామ్రేడ్ వచ్చేసాడు.. శ్రీవిష్ణు కామ్రేడ్ కళ్యాణ్ ట్రైలర్ రిలీజ్! రాయపాడులో విద్యుత్ ఘాతంతో వ్యక్తి మృతి ప్రాంగణ నియామకాల్లో విశ్వం డిగ్రీ కళాశాల విజయదుందుభి గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న వ్యక్తి పై ఎన్ డి పి ఎస్ యాక్ట్ నిర్భంద ఉత్తర్వులు ఆశ వర్కర్ల డిమాండ్లను నెరవేర్చాలి ఏడుపాయల వన దుర్గామాతను దర్శించుకున్న గవర్నర్ ప్రెస్ సెక్రటరీ మామిండ్ల దశరథం తొంబై శాతం సబ్సిడీ తో స్ప్రింక్లర్స్ పంపిణీ స్వర్ణ గిరిలో కలుశ పంచామృత అభిషేకం* వసతులు కరువైన బస్టాండ్ లిటిల్ హార్ట్స్ హీరో మౌళి కొత్త చిత్రం.. దొంగ నా కొడుకు రిలీజ్ డేట్ లాక్! పిచ్చికుక్క సైర విహారం రెండేళ్ళ బాలుడితో సహా ఆరుగురికి గాయాలు క్లీన్ ప్రొద్దుటూరుకు కెమెరాల నిఘా అడుగులు శ్రీ కోటదుర్గ ఆలయం లో గోడ పత్రిక విడుదల కొత్తపల్లి,రావుపల్లి గ్రామాల అంగన్వాడీ వర్కర్లకు సత్కారం మండల విద్యాశాఖ అధికారులకు ఒకరోజు అవగాహన శిక్షణ కార్యక్రమం నిర్వహించిన డీఈవో

సచివాలయం ఉద్యోగికి ఘన సన్మానం

Select Suryaa Now
సచివాలయం ఉద్యోగికి ఘన సన్మానం

చీపురుపల్లి అక్టోబర్ 5 మేజర్ న్యూస్ :

 గరివిడి మండలం గెడ్డపువలస గ్రామంలో మహిళా పోలీస్ గా విధులు నిర్వహిస్తున్న కోరాడ రమ్యరాణి విధినిర్వహణలో భాగంగా ఇటీవల పెన్షన్ పంపిణీలో మాతృత్వాన్ని చాటుకుంది.  తన బిడ్డను ఒడిలో పెట్టుకుని  ప్రభుత్వం అందజేస్తున్న పెన్షన్లను లబ్ధిదారులకు పంపిణీ చేయడం పట్ల జిల్లా కలెక్టర్ సైతం అభినందించారు.  ఇదిలా ఉండగా మండల స్థాయిలో తహసిల్దార్ బంగార్రాజు, ఎంపీడీవో సుబ్రహ్మణ్యం, సచివాలయ సిబ్బంది ఆమెను సోమవారం ఘనంగా సన్మానించారు. చంటి పిల్లలను సైతం భుజాన వేసుకొని పెన్షన్ పంపిణీ చేయడం రాష్ట్రంలో మొదటి స్థాయిగా నిలిచిందని ఆమె సేవలను కొనియాడారు.   ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన చంటి బిడ్డతో పాటు మంచాన పడి ఉన్న వృద్ధులు, వికలాంగులు కూడా తన పిల్లలతో సమానం అంటూ పెన్షన్ల పంపిణీకి తన బిడ్డతో హాజరై విధులు నిర్వహించానని, అందుకు అధికారులు గుర్తించి సన్మానం చేయడం ఆనందంగా ఉందని ఇందుకు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. తన కృషి వెనుక తండ్రి కోరాడ రామకృష్ణ, తల్లి కోరాడ రమ, భర్త అజారుద్దీన్ ల సహకారం తోపాటు గుర్ల  మండలం వల్లాపురం గ్రామపంచాయతీ కార్యదర్శి జే అచ్యుతరావు సూచనలు కూడా ఉన్నాయని ఈ సందర్భంగా సన్మాన గ్రహీతలకు ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో గరివిడి  ఆర్ఐ అచ్యుతరావు, మండల పరిషత్, రెవిన్యూ, సచివాలయం సిబ్బంది  పాల్గొన్నారు.