BREAKING
కడప పెద్ద దర్గా ఉర్సుకు ముఖ్యమంత్రికి ఆహ్వాన పత్రిక అందించిన దర్గా పెద్దలు గిరిజనులకు న్యాయం చేయటంలో అలసత్వం ప్రదర్శిస్తే సహించను రెడ్‌క్రాస్ డైరెక్టర్‌గా* కొమ్మిడి ప్రభాకర్‌రెడ్డి స్వచ్ఛ పార్వతీపురం – మన్యం మర్యాద సిద్ధిపురంలో అంగన్వాడీ సిబ్బందికి ఘన సన్మానం కొడవలూరు మండలానికి పల్లె పండుగ 3.0లో రూ.2.06 కోట్ల పనులు శ్రీశైలంలో నందీశ్వర స్వామికి ప్రత్యేక పూజలు అద్దంకిలో ఈనెల 9న ప్రజాస్వామ్య ఎన్నికల ర్యాలీ. ఉద్యోగుల సంక్షేమానికి సింగరేణి సంస్థ పెద్దపీట 2450 మంది కి సీఎం రిలీఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే బి.ఎన్ విజ్ఞాన్ ఉన్నత పాఠశాలలో ‘సేవా సంకల్ప్ అభియాన్’ పోటీలు ఇంటి ముంగిట అక్షరం... ఉమ జీవితంలో వెలుగుల విప్లవం! భూ సేకరణ పెండింగ్‌ అంశాలను త్వరగా పరిష్కరించాలి జలాంతర్గాముల తయారీకి అండూరిల్‌తో భారీ ఒప్పందం కడప అమీన్‌పీర్ దర్గా ఉర్సుకు సీఎం చంద్రబాబుకు ఆహ్వానం

స్వచ్ఛ పంచాయతీగా పత్తికొండకు రాష్ట్రస్థాయి పురస్కారం

Select Suryaa Now
స్వచ్ఛ పంచాయతీగా పత్తికొండకు రాష్ట్రస్థాయి పురస్కారం

పత్తికొండ, సూర్య ప్రతినిధి మేజర్ న్యూస్:

స్వచ్ఛ ఆంధ్ర అవార్డ్స్–2026లో భాగంగా పత్తికొండ గ్రామ పంచాయతీ రాష్ట్రస్థాయిలో ఉత్తమ 'స్వచ్ఛ గ్రామపంచాయతీ'గా ఎంపికైంది. విజయవాడలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా అధికారులు ఈ ప్రతిష్టాత్మక అవార్డును స్వీకరించారు.

గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణ, తడి-పొడి చెత్త సేకరణ, పచ్చదనం పెంపొందించడంలో గ్రామ పంచాయతీ కనబరిచిన ప్రతిభకు గాను ఈ అవార్డు లభించింది.

డిప్యూటీ ఎంపీడీఓకు ఘన సన్మానం:

రాష్ట్రస్థాయి అవార్డును సాధించడంలో కీలకపాత్ర పోషించిన పత్తికొండ డిప్యూటీ ఎంపీడీఓను గ్రామ పంచాయతీ కార్యాలయంలో సిబ్బంది సోమవారం ఘనంగా సన్మానించారు. ఆయనకు పూలమాలలు వేసి, శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా డిప్యూటీ ఎంపీడీఓ మాట్లాడుతూ— గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో పంచాయతీ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, ప్రజాప్రతినిధులు మరియు గ్రామ ప్రజల సహకారం ఎంతో ఉందన్నారు. అందరి సామూహిక శ్రమ వల్లే ఈ పురస్కారం సాధ్యమైందని, మున్ముందు కూడా ఇదే స్ఫూర్తితో గ్రామాభివృద్ధికి కృషి చేస్తామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో పత్తికొండ గ్రామ పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది, పారిశుద్ధ్య పర్యవేక్షకులు మరియు పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

సూర్య ప్రతినిధి షేక్ దస్తగిరి కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం