తెర్లాం గ్రంథాలయం ... శోభాయ మానం : పాఠకులకు సరికొత్త మూత్ర విసర్జన నిలయం
తె ర్లాం: అక్టోబర్ 5 మేజర్ న్యూస్ :
తెర్లాం లో పాఠకులు కోసం ఏర్పాటుచేసిన గ్రంథాలయo శోభాయమానంగా ఆకర్షిస్తుంది గ్రంథాలయం ముందు పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అన్న చందంగా రకరకాల పూల మొక్కలతో శోబిల్లుతుంది .కాగా పాఠకుల కోసం మల మూత్ర విసర్జన కోసం ఏర్పాటు చేసిన మరుగుదొడ్లు తాగునీరు వంటి పలు రకాల సౌకర్యాలు ఏర్పాటు చేసి పాఠకులు చేత అటు అధికారుల చేత శహభాష్ అని పిoచుకున్న గ్రంథాల అధికారి సిహెచ్ కృష్ణమూర్తి సేవలు ప్రశంసనీయం. ప్రభుత్వ సెలవు దినాల్లో వచ్చిన ఉద్యోగ నిరుద్యోగ యువతకి కావలసిన పుస్తకాలను ఏర్పాటు చేసి వారికి ఏ విధమైన పుస్తకాలు అవసరమో తెలుసుకొని వాటిని సమకూర్చి పాఠకులకు అందించడం పట్ల పలువురు హర్షo వ్యక్తం చేస్తున్నారు. గతంలో గ్రంధాలయం దీనావ స్థితిలో ఉన్నప్పటికీ కృష్ణమూర్తి వచ్చిన తర్వాత గ్రంథాలయ రూప రేఖలుమార్చి తీర్చిదిద్ది స్థానికులచేత స్థానికేతరులచే త ప్రశంసలు అందుకోవడం మరో విశేషం. జిల్లా గ్రంథాలయ సంస్థ నిధులు సమకూర్చిన లేకపోయినా తన సొంతంగా కొంత సొమ్మును ఖర్చు చేసి పాఠకులకు రంజంప చేయడం అతని అలవాటుగా చెప్పుకోక తప్పదు. .మరి భవిష్యత్తులో గ్రంథాలయాన్ని మరింత అభివృద్ధి పథంలోకి నడిపించాలని నడవాలని కోరుకుందాం.