పిజిఆర్ఎస్, రెవిన్యూ క్లినిక్లు ద్వారా స్వీకరించిన అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపాలి దివ్యాంగులు చెంతకు వెళ్ళి అర్జీలను స్వీకరించి, వారికి భరోసానిచ్చిన జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి
ఏలూరు, మేజర్ న్యూస్ : జిల్లా కలెక్టరేటు గోదావరీ సమావేశ మందిరంలో సోమవారం ప్రజా ఫిర్యాదులు పరిష్కార వ్యవస్థ ( మీ కోసం) కార్యక్రమానికి జిల్లా స్థాయీ అధికారులతో జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి అధ్యక్షతన నిర్వహించారు. జిల్లా కలెక్టరుతో పాటు జిల్లా జాయింటు కలెక్టరు డా.యం.జె.అభిషేక్ గౌడ, ఇంచార్జి జిల్లా రెవిన్యూ అధికారి, ఎస్సీ కార్పొరేషన్ ఇడి యం.ముక్కంటి, విజిలెన్స్ స్పెషల్ డిప్యూటీ కలెక్టరు యల్.దేవకీదేవి లు ప్రజలు నుండి అర్జీలను స్వీకరించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ పిజిఆర్ఎస్, రెవిన్యూ క్లినిక్లు, ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలుపై ప్రత్కేక శ్రద్ద వహించాలని సూచించారు. ప్రజాసమస్యలు పరిష్కారంపై రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత నిస్తోందని, అర్జీదారులు సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించి వాటిని సత్వరమే పరిష్కారం చూపాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో అర్జీదారులు ఎదుర్కొంటున్న అంశాలుపై ప్రత్యేక దృష్టిని సారించి, సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజా సమస్యలు పరిష్కారంలో అధికారులు ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం వహించకుండా పరిష్కార మార్గం చూపించాల్సిన బాధ్యత ఆయా శాఖలు అధికారులుపై ఉందని స్పష్టం చేశారు. అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపాలని, ఎట్టి పరిస్థితుల్లో రీఓపెన్ కాకూడదని తెలిపారు. అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి మీ శాఖ పరిధిలోనిది కానట్లయితే నిర్ణీత గడుపు ముగిసే వరకు వేచి ఉండకుండా, సంబంధిత శాఖకు వెంటనే పంపాలని ఆదేశించారు. కాలయాపన, నిర్లక్ష్యం వహిస్తే శాఖా పరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఈ రోజు స్వీకరించిన అర్జీలలో కొన్నికామవరపుకోట మండలం సాగిపాడు గ్రామానికి చెందిన గోగు చినమంగమ్మ 170/1 సర్వే నెంబరులో కల 80 సెంట్లు భూమిని హద్దులు నిర్ణయించి అప్పగించాలని కోరారు, పెదవేగి మండలం చక్రాయగూడెం గ్రామానికి చెందిన గారపాటి కనకదుర్గ సునీత మాభూమి సర్వేచేసి పట్టాదారు పాసుపుస్తకం ఇప్పించాలని అర్జీని సమర్పించారు, ముదినేపల్లి మండలం పెయ్యేరు గ్రామనివాసి కొట్టి బేబీషాలిని నా తండ్రి రెవిన్యూ డిపార్ట్మెంటులో చనిపోయారు. కారుణ్య నియామకం కింద నా సోదరుడు ఉద్యోగం పొందారు కాని నన్ను, కన్న తల్లిని కూడా చూచుటలేదని, తల్లి చనిపోయినను పట్టించుకోలేదని న్యాయం చెయ్యాలని కోరారు, జంగారెడ్డిగూడెం మండలం కేతవరం గ్రామానికి చెందిన వామశెట్టి మణెమ్మ మాది నిరుపేద కుటుంబం అద్ది ఇంట్లో ఉంటున్నాము, పక్కా గృహ నిర్మాణం మంజూరు చెయ్యాలని కోరారు, చింతలపూడి మండలం రేచర్ల గ్రామ నివాసి నండ్రు మధుసూదనరావు ఇంటి నిర్మాణం పూర్తిచేసి చేసి నాలుగు ఏళ్ళు అయిందని, ఇంతవరకు బిల్లులు జమకాలేదని బిల్లులు జమ అయ్యేలా చూడాలని కోరారు.ఈ కార్యక్రమంలో వివిధ శాఖలు జిల్లా అధికారులు, తహశీల్దార్లు, డిప్యూటీ తహశీల్దార్లు, డివిజన్, మండల సర్వేయర్లు, జిల్లా కలెక్టరేటు సూపర్డెంట్లు, తదితరులు పాల్గొన్నారు.
పసుమర్తి రాము జిల్లా ఇంచార్జ్