11 నుండి 20 వరకు దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలను
బుట్టాయగూడెం : మేజర్ న్యూస్: బుట్టాయగూడెం లోని త్రిశక్తిపీఠంలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలకు పందిరి రాట మహోత్సవంతో అంకురార్పణ చేశారు. ఆలయ అర్చకుడు ఉడత ఉమామహేశ్వర రావు ఆధ్వర్యంలో సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించి, పందిరి రాటతో దసరా మహోత్సవాల సన్నాహక కార్యక్రమాలను ప్రారంభించారు.ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఆలయంలో ఈనెల 11వ తేదీ నుండి 20వ తేదీ వరకు దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలను ప్రత్యేక పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలతో అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు కరాటం రాజగోపాల్, నూకల కాంతినాథ్, బేతా సతీష్, భక్తులు గుబ్బల వెంకటరమణ, కరాటం గీత, నూకల పద్మజ్యోతి, ఉప్పల నాగమణి, తదితరులు పాల్గొన్నారు.
కట్ట మధుసూదన్ రావు బుట్టాయిగూడెం