BREAKING
గీతంలో ఎడిటింగ్, ప్రచురణపై కార్యశాల సేవా సేతు పథకాన్ని సద్వినియోగం చేసుకోండి సంగారెడ్డి జిల్లా రిజిస్ట్రార్‌గా సందీప్ కుమార్ బాధ్యతలు భాకరాపురం పెండింగ్ పనులు పూర్తి చేయాలని ఆదేశం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా వజనాల విశ్వాస్ నియామకం. స్వచ్ఛ పంచాయతీగా పత్తికొండకు రాష్ట్రస్థాయి పురస్కారం టిడిపి కూటమి ఆశయాలే రాష్ట్ర ప్రగతికి నిదర్శనం చుంచుపల్లి తండా వాసి మృతి.. .హరికృష్ణ మృతి పై పలు అనుమానాలు..? ప్రజావాణికి ,కేవలం రెండు దరఖాస్తులు మాత్రమే. జూబ్లీహిల్స్ అసెంబ్లీ బీజేపీ ఎండోమెంట్ సెల్ కన్వీనర్‌గా అత్తిలి గోపాల్ హైదరాబాద్ జిల్లా బీజేపీ ఎండోమెంట్ సెల్ జాయింట్ కన్వీనర్‌గా కె. ఉష తెర్లాం గ్రంథాలయం ... శోభాయ మానం : పాఠకులకు సరికొత్త మూత్ర విసర్జన నిలయం గొల్జాంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కోళ్ల సచివాలయం ఉద్యోగికి ఘన సన్మానం కృష్ణానదిలో మృతదేహం లభ్యం

ఎల్బండ సచివాలయంలో ఘనంగా 'పోషణ్ మా' ఉత్సవాలు

Select Suryaa Now
ఎల్బండ సచివాలయంలో ఘనంగా 'పోషణ్ మా' ఉత్సవాలు

వెల్దుర్తి సూర్య ప్రతినిధి మేజర్ న్యూస్ 

వెల్దుర్తి ప్రాజెక్ట్, వెల్దుర్తి-2 సెక్టార్ పరిధిలోని ఎల్బండ సచివాలయం ప్రాంగణంలో సోమవారం పోషణ్ మా (పోషణ మాస ఉత్సవాలు) కార్యక్రమాన్ని 6 అంగన్‌వాడీ కేంద్రాల ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ఐసిడిఎస్ సూపర్వైజర్ సరస్వతమ్మ హాజరై మాట్లాడారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గర్భవతులు, బాలింతలు మరియు చిన్నారులకు ప్రభుత్వం అందిస్తున్న టేక్ హోమ్ రేషన్ (THR) ప్రాధాన్యతను ఆమె వివరించారు. ప్రభుత్వం పంపిణీ చేస్తున్న పోషకాహార నిల్వలు, స్టాక్స్ కేవలం లబ్ధిదారులు మాత్రమే వినియోగించుకోవాలని కోరారు. గర్భవతులు, బాలింతలు తమ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి, సమతుల్య పోషకాహారాన్ని క్రమం తప్పకుండా తీసుకోవాలని సూచించారు.

అనంతరం హెల్త్ సూపర్వైజర్ మాట్లాడుతూ, చిన్న పిల్లలకు మరియు గర్భవతులకు సమయానికి అన్ని రకాల టీకాలు వేయించడం తప్పనిసరి అని స్పష్టం చేశారు. డిసిపియు (DCPU) అధికారిణి గీతావాణి మాట్లాడుతూ, బాల్య వివాహాల వల్ల కలిగే దుష్పరిణామాలు, శారీరక, మానసిక సమస్యలపై అవగాహన కల్పించారు. చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేయడం చట్టరీత్యా నేరమని, బాలికల విద్యకు, భవిష్యత్తుకు ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు.

కేంద్ర ప్రభుత్వ పథకాలపై బిజెపి నాయకురాలు శాంతమ్మ మాట్లాడారు. అనంతరం అంగన్‌వాడీ కేంద్రంలో ఏర్పాటు చేసిన వివిధ రకాల పోషకాహార స్టాళ్లను, పౌష్టికాహార వంటకాలను అతిథులు, అధికారులు పరిశీలించారు.

కార్యక్రమంలో భాగంగా అంగన్‌వాడీ టీచర్లు ఆసియా బి, ప్రమీల, సావిత్రిబాయి, జయలక్ష్మిలను శాలువాలతో ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా కార్యదర్శి చిన్నబాబు, మౌనిక, అంగన్‌వాడీ కమిటీ సభ్యులు, ఆశా కార్యకర్తలు, గర్భవతులు, బాలింతలు మరియు స్థానిక తల్లులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

సూర్య ప్రతినిధి షేక్ దస్తగిరి కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం