సీసీ రోడ్డు నిర్మాణం ప్రారంభించిన ఎంపీ, ఎమ్మెల్యే
అవనిగడ్డ అక్టోబర్ 5 మేజర్ న్యూస్ అవనిగడ్డలో నూతన సీసీ రోడ్డు నిర్మాణ పనులను మచిలీపట్టణం ఎంపీ వల్లభనేని బాలశౌరి, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ప్రారంభించారు. సోమవారం స్థానిక కొత్త వంతెన వద్ధ నుంచి డీఎస్పీ కార్యాలయం వరకూ నూతన సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ తన పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ ద్వారా చేపట్టిన పల్లె పండుగ-3.0 కార్యక్రమం పురస్కరించుకొని వీబీ-గ్రామ్-జీ నిధులు రూ.42 లక్షలతో ఈ రోడ్డు నిర్మాణం చేపట్టారు.