నాటి కేసీఆర్ సంకల్పమే.. నేటి కల్యాణ లక్ష్మి*
పేద యువతులకు అండగా నిలిచిన మేనమామ, పెద్దన్న కేసీఆర్….
మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్…
కల్యాణ లక్ష్మి పథకం ప్రారంభమై 12 ఏళ్లు గడిచిన సందర్భంగా పార్టీ కార్యాలయంలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం….
తెలంగాణ రాష్ట్ర సాధకులు, మాజీ సీఎం కేసీఆర్ దృఢ సంకల్పంతోనే కళ్యాణ లక్ష్మి పథకం పురుడు పోసుకుందని మాజీ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ అన్నారు. సోమవారం పట్టణంలోని పార్టీ కార్యాలయ ఆవరణలో కల్యాణ లక్ష్మి పథకం ప్రారంభమై 12 ఏళ్లు గడిచిన శుభ సందర్భంగా కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన అనంతరం మాట్లాడారు. గతంలో ఎంతోమంది తమ పిల్లలకు పెళ్లిళ్లు చేయలేక తీవ్ర ఇబ్బందులు పడుతుండేవారని, ఒకానొక సమయంలో ఆడపిల్లలను కనాలంటేనే భయపడే పరిస్థితికి వచ్చిందని, నాటి పరిస్థితులను గమనించిన కేసీఆర్ పేద ప్రజలకు అండగా నిలవాలనే ఉద్దేశం తో కళ్యాణ లక్ష్మి పథకాన్ని రూపొందించారని గుర్తు చేశారు. గిరిజన కుటుంబంలో జరిగిన ఇబ్బందులను గుర్తించి నాడు 50 వేల ఆర్థిక సాయంతో ప్రారంభించిన పథకం రూ. లక్ష వరకు చెల్లించి పేద ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారని అన్నారు. మూడోసారి అధికారంలోకి వస్తే రూ. మూడు లక్షల నగదును కల్యాణ లక్ష్మి పథకం ద్వారా పేద యువతలకు అందిస్తామని కేసీఆర్ ప్రకటిస్తే, మోసపూరిత మాటలతో కాంగ్రెస్ లక్ష రూపాయల నగదు తో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక పథకాన్ని పూర్తిగా మర్చిపోయారని ఆరోపించారు. మహిళల సంక్షేమం కోసం కెసిఆర్ చిత్తశుద్ధితో పనిచేస్తే, నేటి ముఖ్యమంత్రి మహిళల అభివృద్ధిపై కనీస ధ్యాస లేదని ఆరోపించాను. కళ్యాణ లక్ష్మి ప్రారంభమై 12 ఏళ్లు గడవడం శుభసందర్భమని కేసీఆర్ చేసిన పనితీరును మరోమారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో మహిళా కోర్దినేటర్ రాజ్యలక్ష్మి, మాజీ మున్సిపల్ చైర్మన్ లావణ్య, మాజీ జడ్పీటీసీ ఎమ్మె శ్రీలత, ఫరూఖ్ నగర్ మండల మహిళ అధ్యక్షులు సుష్మా రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ మౌనిక, కౌన్సిలర్లు పిల్లి శారద, జి.టి వసంత, ఒగ్గు జయలక్ష్మి, నడికూడ అనిత, చల్లా వాణి, మాజీ కౌన్సిలర్లు ప్రేమలత, జూపల్లి కౌసల్య, సర్పంచ్ నాళ్ళపురం రాధిక, మహిళా నాయకులు విజయలక్ష్మి, కృష్ణవేణి, పద్మమ్మ తదితరులు, మహిళలు పాల్గొన్నారు..
M. నరసింహ రెడ్డి ,మేజర్ న్యూస్, ఫరూక్ నగర్….