BREAKING
గీతంలో ఎడిటింగ్, ప్రచురణపై కార్యశాల సేవా సేతు పథకాన్ని సద్వినియోగం చేసుకోండి సంగారెడ్డి జిల్లా రిజిస్ట్రార్‌గా సందీప్ కుమార్ బాధ్యతలు భాకరాపురం పెండింగ్ పనులు పూర్తి చేయాలని ఆదేశం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా వజనాల విశ్వాస్ నియామకం. స్వచ్ఛ పంచాయతీగా పత్తికొండకు రాష్ట్రస్థాయి పురస్కారం టిడిపి కూటమి ఆశయాలే రాష్ట్ర ప్రగతికి నిదర్శనం చుంచుపల్లి తండా వాసి మృతి.. .హరికృష్ణ మృతి పై పలు అనుమానాలు..? ప్రజావాణికి ,కేవలం రెండు దరఖాస్తులు మాత్రమే. జూబ్లీహిల్స్ అసెంబ్లీ బీజేపీ ఎండోమెంట్ సెల్ కన్వీనర్‌గా అత్తిలి గోపాల్ హైదరాబాద్ జిల్లా బీజేపీ ఎండోమెంట్ సెల్ జాయింట్ కన్వీనర్‌గా కె. ఉష తెర్లాం గ్రంథాలయం ... శోభాయ మానం : పాఠకులకు సరికొత్త మూత్ర విసర్జన నిలయం గొల్జాంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కోళ్ల సచివాలయం ఉద్యోగికి ఘన సన్మానం కృష్ణానదిలో మృతదేహం లభ్యం

ప్రజావాణిలో ఫిర్యాదులు స్వీకరించిన ఎస్పీ స్నేహ మెహ్రా

Select Suryaa Now
ప్రజావాణిలో ఫిర్యాదులు స్వీకరించిన ఎస్పీ స్నేహ మెహ్రా

వికారాబాద్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్ (అక్టోబర్ 5): ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించి, వారి సమస్యలను పరిష్కరించేందుకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా, ఐపీఎస్ తెలిపారు. సోమవారం వికారాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆమె ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులను స్వీకరించారు.
జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులతో ఎస్పీ స్వయంగా మాట్లాడి వారి సమస్యలను ఓపికగా విన్నారు. ఫిర్యాదులకు సంబంధించిన వివరాలను తెలుసుకుని, సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత పోలీస్ అధికారులతో మాట్లాడారు. ఫిర్యాదులను చట్టపరిధిలో సమగ్రంగా పరిశీలించి, తక్షణమే స్పందించాలని అధికారులను ఆదేశించారు.
ప్రతి ఫిర్యాదును బాధ్యతగా స్వీకరించి, బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ సూచించారు. ఫిర్యాదుల పరిష్కారంలో ఎలాంటి జాప్యం లేకుండా సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. అవసరమైన సందర్భాల్లో ఫిర్యాదుదారులతో సమన్వయం చేసుకుంటూ సమస్యలను పరిష్కరించాలని తెలిపారు.ప్రజల సమస్యలను తెలుసుకుని వారికి సత్వర న్యాయం అందించడం పోలీస్ శాఖ ప్రధాన బాధ్యతల్లో ఒకటని ఎస్పీ పేర్కొన్నారు. ప్రజలు తమ సమస్యలు, ఫిర్యాదులను నిర్భయంగా పోలీసుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. అవసరమైన సందర్భాల్లో నేరుగా తనను సంప్రదించవచ్చని, పోలీస్ శాఖ ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటుందని భరోసా కల్పించారు.ప్రజావాణి ద్వారా అందిన ప్రతి ఫిర్యాదును సంబంధిత అధికారులు ప్రాధాన్యతతో పరిశీలించి, నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ స్నేహ మెహ్రా ఆదేశించారు.

కుమ్మరి రాఘవేందర్, వికారాబాద్ జిల్లా ప్రతినిధి.