ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వద్దు,- పోలీసు అధికారులకు జిల్లా ఏఎస్పీ వెంకటాద్రి ఆదేశం
మదనపల్లె : ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం చేయరాదని పోలీసు అధికారులను జిల్లా ఏఎస్పీ ఎం.వెంకటాద్రి ఆదేశించారు.జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ (పరిపాలన) ఎం.వెంకటాద్రి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు.మొత్తం 67 పిర్యాదుల్లో భూ వివాదాలు 35,ఆర్థిక వివాదాలు 8,కుటుంబ వివాదాలు 9,న్యూసెన్స్ 5,పరిపాలనా సంబంధిత 2,సైబర్ 2 ఇతరలు 6 ఫిర్యాదులు ఉన్నాయన్నారు.బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను అదనపు ఎస్పీ ఆదేశించారు.ప్రజా సమస్యలను ఎప్పుటికప్పుడు పరిష్కరించి పోలీస్ శాఖపై నమ్మకాన్ని పెంచాలన్నారు.ఈ కార్యక్రమానికి రాలేని వారు తమ సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో కూడా ఫిర్యాదు చేయవచ్చని ఆయన సూచించారు.