ఎస్సై, పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ కోసం ఉచిత రెసిడెన్షియల్ శిక్షణ
(సూర్య, ఖమ్మం బ్యూరో) :రాష్ట్ర షెడ్యూల్డ్ కులముల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ నిరుద్యోగ అభ్యర్థుల నుంచి ఎస్సై, పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ పరీక్షల కొరకు ఉచిత భోజనం, రెసిడెన్షియల్ శిక్షణ ఇచ్చేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎస్సీ సంక్షేమ శాఖ ఉప సంచాలకులు, ఎస్సీ స్టడీ సర్కిల్ కార్యదర్శి జి. జ్యోతి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్ స్టేట్ డైరెక్టర్ ఏ. నరసింహ రెడ్డి ఆదేశాల మేరకు ఈ ఉచిత శిక్షణ ఖమ్మం ఎస్సీ స్టడీ సర్కిల్ కేంద్రంలో నిర్వహించబడుతుందని అన్నారు.ఈ శిక్షణా కాలపరిమితి ఈ నెల 12 నుండి డిసెంబర్ 20 వరకు (రెండు నెలలు) కొనసాగుతుందని ఉప సంచాలకులు అన్నారు. ఎస్సై, పోలీస్ కానిస్టేబుల్ ఉచిత శిక్షణ కొరకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎస్సై, పోలీస్ కానిస్టేబుల్ పోస్ట్ లకి దరఖాస్తు చేసిన అక్నాలెడ్జ్‌మెంట్ జిరాక్స్ తోపాటు డిగ్రీ విద్యార్హత ఒరిజినల్ సర్టిఫికేట్, అన్ని విద్యార్హతల సర్టిఫికేట్ల జిరాక్స్ ప్రతులు, రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు, ఆధార్ కార్డు జిరాక్స్ లతో ఈ నెల 5 వ తేదీ నుంచి ఈ నెల 9 వ తేదీ సాయంత్రం 5.00 గంటల వరకు రిపోర్ట్ చేయాలన్నారు. ఇతర పూర్తి వివరాల కోసం అభ్యర్థులు 9866726277, 9032077276 ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చని ఉప సంచాలకులు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.