BREAKING
కృష్ణానదిలో మృతదేహం లభ్యం ప్రజాస్వామ్య పరిరక్షణకు INDIA కూటమి పిలుపు అంబ భవాని నవరాత్రి ఉత్సవాలకు ప్రముఖులకు ఆహ్వానం పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం - మండల స్పెషల్ ఆఫీసర్ ఆర్తమురులో మీ భూమి మీ హక్కు కార్యక్రమం తెలంగాణ స్టడీ సర్కిల్ లో ఎస్సై పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ కొరకు ఉచిత శిక్షణ; :ఎస్సీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ జి జ్యోతి సీసీ రోడ్డు నిర్మాణం ప్రారంభించిన ఎంపీ, ఎమ్మెల్యే బోయినపల్లి మండల ప్రజావాణిలో 2 అర్జీలు.. ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వద్దు,- పోలీసు అధికారులకు జిల్లా ఏఎస్పీ వెంకటాద్రి ఆదేశం గోదావరి పుష్కరాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలి 11 నుండి 20 వరకు దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలను ప్రజా సమస్యల పరిష్కారంలో నాణ్యత, సకాలంలో పరిష్కారమే లక్ష్యం - జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ ఎల్బండ సచివాలయంలో ఘనంగా 'పోషణ్ మా' ఉత్సవాలు నాటి కేసీఆర్ సంకల్పమే.. నేటి కల్యాణ లక్ష్మి* గ్రాండ్ ఎస్ ఎల్ ఎన్ లాడ్జ్ డీలక్స్ ప్రారంభించిన ఎమ్మెల్యే పల్లా

ప్రజావాణికి జిల్లా అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలి

Select Suryaa Now
ప్రజావాణికి జిల్లా అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలి

గైర్హాజరైతే షోకాజ్ నోటీసులు జారీ చేయాలి

కలెక్టర్ దీపక్ తివారి

వికారాబాద్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్( అక్టోబర్ 5):
ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకు నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా స్థాయి అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని జిల్లా కలెక్టర్ దీపక్ తివారి ఆదేశించారు. ప్రజావాణికి హాజరు కాని అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.సోమవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ దీపక్ తివారి ప్రజల నుంచి ఫిర్యాదులు, వినతులను స్వీకరించారు. వివిధ సమస్యలపై మొత్తం 103 ఫిర్యాదులు అందినట్లు అధికారులు తెలిపారు. ప్రతి ఫిర్యాదును సంబంధిత శాఖ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి, నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు.ప్రజావాణి కార్యక్రమానికి అధికారులు సమయపాలనతో హాజరై ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను స్వయంగా స్వీకరించాలని సూచించారు. ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం లేకుండా చర్యలు చేపట్టడంతో పాటు, పరిష్కార పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాలు సకాలంలో అందేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

మండల ప్రజావాణిపై ప్రత్యేక దృష్టి

ప్రతి సోమవారం మండల స్థాయిలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాలకు సంబంధించిన ఫిర్యాదుల పరిష్కారంపై మండల ప్రత్యేక అధికారులు పూర్తి బాధ్యత వహించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రజల నుంచి స్వీకరించిన ఫిర్యాదుల జాబితాను సమర్పించడంతో పాటు, వాటి పరిష్కార స్థితిగతులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు.ప్రజావాణికి గైర్హాజరయ్యే అధికారులు తమ శాఖకు సంబంధించిన అంశాలపై ప్రజలకు సమాధానం ఇచ్చే విషయంలో ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి అధికారులు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు.

‘మీ ప్రమాణం’ యాప్‌లో నమోదు

జిల్లాలోని అధికారులు, సిబ్బంది అందరూ ‘మీ ప్రమాణం’ యాప్‌లో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రభుత్వ కార్యక్రమాల అమలులో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటాచారి, జెడ్పీ సీఈఓ సుధీర్, డీఆర్‌డీఏ అధికారి శ్రీనివాస్, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

కుమ్మరి రాఘవేందర్, వికారాబాద్ జిల్లా ప్రతినిధి.