హుండీ ఆదాయం రూ.15.13 లక్షలు
మార్కాపురం మేజర్ న్యూస్
శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానంలో హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. దేవస్థానం కార్యనిర్వహణ అధికారి గొలమారి శ్రీనివాసులు రెడ్డి, దేవాలయ ఇన్‌స్పెక్టర్ ఆర్.కె. చైతన్య పర్యవేక్షణలో హుండీ ఆదాయాన్ని లెక్కించారు.గత ఐదు నెలల 19 రోజులుగా హుండీలో భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించగా మొత్తం రూ.15,13,625 ఆదాయం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. గతంలో నాలుగు నెలల 15 రోజుల హుండీ ఆదాయం రూ.12,45,666గా ఉంది. గత హుండీతో పోలిస్తే ప్రస్తుతం రూ.2,67,959 అదనపు ఆదాయం వచ్చినట్లు తెలిపారు.హుండీ లెక్కింపు కార్యక్రమంలో రాజ్యలక్ష్మి సేవా సంఘం మహిళలు, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈవో గొలమారి శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ భక్తుల విశ్వాసం, సహకారంతో దేవస్థానం హుండీ ఆదాయం పెరిగిందన్నారు. భక్తులకు అవసరమైన సౌకర్యాల కల్పనకు ఆలయ అభివృద్ధికి ఈ ఆదాయాన్ని వినియోగించనున్నట్లు తెలిపారు.