BREAKING
ఆర్తమురులో మీ భూమి మీ హక్కు కార్యక్రమం తెలంగాణ స్టడీ సర్కిల్ లో ఎస్సై పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ కొరకు ఉచిత శిక్షణ; :ఎస్సీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ జి జ్యోతి సీసీ రోడ్డు నిర్మాణం ప్రారంభించిన ఎంపీ, ఎమ్మెల్యే బోయినపల్లి మండల ప్రజావాణిలో 2 అర్జీలు.. ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వద్దు,- పోలీసు అధికారులకు జిల్లా ఏఎస్పీ వెంకటాద్రి ఆదేశం గోదావరి పుష్కరాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలి 11 నుండి 20 వరకు దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలను ప్రజా సమస్యల పరిష్కారంలో నాణ్యత, సకాలంలో పరిష్కారమే లక్ష్యం - జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ ఎల్బండ సచివాలయంలో ఘనంగా 'పోషణ్ మా' ఉత్సవాలు నాటి కేసీఆర్ సంకల్పమే.. నేటి కల్యాణ లక్ష్మి* గ్రాండ్ ఎస్ ఎల్ ఎన్ లాడ్జ్ డీలక్స్ ప్రారంభించిన ఎమ్మెల్యే పల్లా ప్రజావాణిలో ఫిర్యాదులు స్వీకరించిన ఎస్పీ స్నేహ మెహ్రా పిజిఆర్‌ఎస్, రెవిన్యూ క్లినిక్లు ద్వారా స్వీకరించిన అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపాలి దివ్యాంగులు చెంతకు వెళ్ళి అర్జీలను స్వీకరించి, వారికి భరోసానిచ్చిన జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి హిందూ స్మశాన వాటికను అభివృద్ధి చేసి, కంచె ఏర్పాటు చేయాలని రాష్ట్ర మంత్రి ఎన్‌ఎండి ఫరూక్‌కు వినతి ఎ ఎస్ ఫ్యాషన్ షో జోన్ మెన్స్ వేర్ స్టోర్ ప్రారంభించిన ఎమ్మెల్యే పల్లా

సేవా సంకల్పంతో మెగా హెల్త్ క్యాంప్

Select Suryaa Now
సేవా సంకల్పంతో మెగా హెల్త్ క్యాంప్

ప్రభుత్వ ఆసుపత్రిలో గైనకాలజీ విభాగం, వాటర్ ప్లాంట్ ప్రారంభించిన ఎరిక్షన్ బాబు

యర్రగొండపాలెం మేజర్ న్యూస్ 

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా సేవా సంకల్ప అభియాన్ ఆధ్వర్యంలో యర్రగొండపాలెం ప్రభుత్వ ఆసుపత్రిలో సోమవారం మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్ బాబు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన గైనకాలజీ విభాగాన్ని, వాటర్ ప్లాంట్‌ను ఎరిక్షన్ బాబు ప్రారంభించారు. అనంతరం మెగా హెల్త్ క్యాంప్‌లో అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించారు. ఆసుపత్రికి వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు, తాగునీటి సౌకర్యం అందుబాటులో ఉండటం ద్వారా రోగులు, వారి సహాయకులకు ప్రయోజనం కలుగుతుందని నిర్వాహకులు తెలిపారు.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా ప్రజలకు ప్రత్యక్షంగా ఉపయోగపడే కార్యక్రమాలను చేపడుతున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. ఆరోగ్య పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు అవసరమైన వారికి వైద్య సేవలు అందించడమే మెగా హెల్త్ క్యాంప్ ఉద్దేశమని తెలిపారు.కార్యక్రమంలో యర్రగొండపాలెం మండల టీడీపీ అధ్యక్షుడు చిట్యాల వెంగల్ రెడ్డి, మండల కూటమి నాయకులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.