BREAKING
అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న మాజీ పార్లమెంట్ సభ్యులు రంగుల ప్రతాపరెడ్డి 120 మంది నిరుపేదలకు భూమి చూపించాలని తహసీల్దార్ కు వినతి గీతంలో ఎడిటింగ్, ప్రచురణపై కార్యశాల సేవా సేతు పథకాన్ని సద్వినియోగం చేసుకోండి సంగారెడ్డి జిల్లా రిజిస్ట్రార్‌గా సందీప్ కుమార్ బాధ్యతలు భాకరాపురం పెండింగ్ పనులు పూర్తి చేయాలని ఆదేశం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా వజనాల విశ్వాస్ నియామకం. స్వచ్ఛ పంచాయతీగా పత్తికొండకు రాష్ట్రస్థాయి పురస్కారం టిడిపి కూటమి ఆశయాలే రాష్ట్ర ప్రగతికి నిదర్శనం చుంచుపల్లి తండా వాసి మృతి.. .హరికృష్ణ మృతి పై పలు అనుమానాలు..? ప్రజావాణికి ,కేవలం రెండు దరఖాస్తులు మాత్రమే. జూబ్లీహిల్స్ అసెంబ్లీ బీజేపీ ఎండోమెంట్ సెల్ కన్వీనర్‌గా అత్తిలి గోపాల్ హైదరాబాద్ జిల్లా బీజేపీ ఎండోమెంట్ సెల్ జాయింట్ కన్వీనర్‌గా కె. ఉష తెర్లాం గ్రంథాలయం ... శోభాయ మానం : పాఠకులకు సరికొత్త మూత్ర విసర్జన నిలయం గొల్జాంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కోళ్ల

హిందూ స్మశాన వాటికను అభివృద్ధి చేసి, కంచె ఏర్పాటు చేయాలని రాష్ట్ర మంత్రి ఎన్‌ఎండి ఫరూక్‌కు వినతి

Select Suryaa Now
హిందూ స్మశాన వాటికను అభివృద్ధి చేసి, కంచె ఏర్పాటు చేయాలని  రాష్ట్ర మంత్రి ఎన్‌ఎండి ఫరూక్‌కు వినతి

నంద్యాల బ్యూరో:
నంద్యాల పట్టణ పరిధిలోని పొన్నాపురం గ్రామం, బసవతారక నగర్ (పొన్నాపురం కాలనీ) పరిసరాల్లో ఉన్న హిందూ స్మశాన వాటికను సమగ్రంగా అభివృద్ధి చేయాలని, ఆక్రమణలను అరికట్టి రక్షణ కంచె (ఫెన్సింగ్) ఏర్పాటు చేయాలని కోరుతూ కాలనీ వాసులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండి ఫరూక్‌‌కు వినతిపత్రం సమర్పించారు. నంద్యాలలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో 22వ వార్డు టీడీపీ ఇంచార్జి షేక్ మహమ్మద్ రఫీ (మున్నా) ఆధ్వర్యంలో స్థానిక నాయకులు, స్మశాన వాటిక కమిటీ సభ్యులు మంత్రి ఫరూక్ ని మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా షేక్ మహమ్మద్ రఫీ (మున్నా) మాట్లాడుతూ కాలనీలోని హిందూ స్మశాన వాటిక స్థలం ఆక్రమణలకు గురవుతోందని అన్నారు . రెవెన్యూ అధికారులతో పూర్తిస్థాయిలో సర్వే చేయించి, నిర్దేశిత స్థలాన్ని స్మశాన వాటికకు కేటాయించాలని కోరారు. చుట్టూ పటిష్టమైన కంచె నిర్మించడంతో పాటు తాగునీరు, విద్యుత్, అంతర్గత రహదారులు వంటి ప్రాథమిక సౌకర్యాలు కల్పించి అభివృద్ధి చేయాలని మంత్రి ఫరూక్ దృష్టికి తీసుకెళ్లారు. సమస్యలపై సానుకూలంగా స్పందించిన మంత్రి ఫరూక్, తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనార్దన్ గౌడ్, ఖాజా శంకర్, మా భాష మరియు హిందూ స్మశాన వాటిక కమిటీ సభ్యులు జాకటి శేఖర్, పుట్టా నాగరాజు, రమేష్ అయ్య, శ్రీరాములు బాల్లవరం, ఎస్. శ్రీహరి, జి. వీరకుమార్, ఆర్. వెంకటరాయుడు, కె. శేషు గౌడ్, పున్నయ్య, నాగ మద్దిలేటి, ఎం. వెంకటరమణ, దాసరి వెంకటేశ్వర్లు, రమణ చాకలి, బాదుల్లా, ఓ. పామన్న, ఎన్. సుబ్బయ్య, కొత్తూరు ఎస్వీ ప్రసాద్, ఓ. అంకన్న, నాగేశం చాకలి, పుల్లయ్య, టి. బాలు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.