ఎ ఎస్ ఫ్యాషన్ షో జోన్ మెన్స్ వేర్ స్టోర్ ప్రారంభించిన ఎమ్మెల్యే పల్లా
ఎఎస్ ఫ్యాషన్ షో జోన్ మెన్స్‌వేర్ స్టోర్ ప్రారంభించిన ఎమ్మెల్యే పల్లా
జనగామ జిల్లా, సూర్య ప్రతినిధి అక్టోబర్ 05 మేజర్ న్యూస్ ):-
జనగామ పట్టణ కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎఎస్ ఫ్యాషన్ షో జోన్ మెన్స్‌వేర్ స్టోర్‌ను సోమవారం జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా స్టోర్ నిర్వాహకు లకు శుభాకాంక్షలు తెలిపారు.పట్టణంలో నూతన వాణిజ్య సంస్థలు ఏర్పాటు కావడం ద్వారా ప్రజలకు మరిన్ని సేవలు, ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయని ఎమ్మెల్యే పల్లా పేర్కొన్నారు. స్టోర్ నిర్వాహకులు వినియోగదారులకు నాణ్యమైన దుస్తులు, మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు.