BREAKING
అంబ భవాని నవరాత్రి ఉత్సవాలకు ప్రముఖులకు ఆహ్వానం పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం - మండల స్పెషల్ ఆఫీసర్ ఆర్తమురులో మీ భూమి మీ హక్కు కార్యక్రమం తెలంగాణ స్టడీ సర్కిల్ లో ఎస్సై పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ కొరకు ఉచిత శిక్షణ; :ఎస్సీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ జి జ్యోతి సీసీ రోడ్డు నిర్మాణం ప్రారంభించిన ఎంపీ, ఎమ్మెల్యే బోయినపల్లి మండల ప్రజావాణిలో 2 అర్జీలు.. ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వద్దు,- పోలీసు అధికారులకు జిల్లా ఏఎస్పీ వెంకటాద్రి ఆదేశం గోదావరి పుష్కరాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలి 11 నుండి 20 వరకు దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలను ప్రజా సమస్యల పరిష్కారంలో నాణ్యత, సకాలంలో పరిష్కారమే లక్ష్యం - జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ ఎల్బండ సచివాలయంలో ఘనంగా 'పోషణ్ మా' ఉత్సవాలు నాటి కేసీఆర్ సంకల్పమే.. నేటి కల్యాణ లక్ష్మి* గ్రాండ్ ఎస్ ఎల్ ఎన్ లాడ్జ్ డీలక్స్ ప్రారంభించిన ఎమ్మెల్యే పల్లా ప్రజావాణిలో ఫిర్యాదులు స్వీకరించిన ఎస్పీ స్నేహ మెహ్రా పిజిఆర్‌ఎస్, రెవిన్యూ క్లినిక్లు ద్వారా స్వీకరించిన అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపాలి దివ్యాంగులు చెంతకు వెళ్ళి అర్జీలను స్వీకరించి, వారికి భరోసానిచ్చిన జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి

కాంట్రాక్ట్‌ ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయాలి

Select Suryaa Now
కాంట్రాక్ట్‌ ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయాలి

మార్కాపురం కలెక్టరేట్‌ వద్ద ఎంహెచ్‌ కాంట్రాక్ట్‌ ఉద్యోగుల నిరసన
100 శాతం గ్రాస్‌ జీతాన్ని పునరుద్ధరించాలని డిమాండ్‌
మార్కాపురం మేజర్ న్యూస్ 
వైద్య ఆరోగ్యశాఖలో ఏళ్ల తరబడి కాంట్రాక్ట్‌ పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయాలని ఏపీ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ కాంట్రాక్ట్‌ ఎంప్లాయీస్‌ జేఏసీ డిమాండ్‌ చేసింది. తమ న్యాయమైన సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతూ సోమవారం మార్కాపురం కలెక్టరేట్‌ వద్ద కాంట్రాక్ట్‌ ఉద్యోగులు నిరసన చేపట్టారు.
ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ.. వైద్య ఆరోగ్యశాఖలో వివిధ విభాగాల్లో కాంట్రాక్ట్‌ ఉద్యోగులుగా ఎన్నో సంవత్సరాలుగా సేవలందిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రులు, వైద్య ఆరోగ్య కేంద్రాల్లో ప్రజలకు వైద్య సేవలు అందించడంలో కాంట్రాక్ట్‌ ఉద్యోగులు కీలకపాత్ర పోషిస్తున్నప్పటికీ, తమ ఉద్యోగ భద్రతపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
కాంట్రాక్ట్‌ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంతో పాటు వారిని రెగ్యులరైజ్‌ చేయాలని వారు డిమాండ్‌ చేశారు. అలాగే 100 శాతం గ్రాస్‌ జీతాన్ని పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని కోరారు. 2018 సంవత్సరం నుంచి అమలవుతున్న వేతన తగ్గింపు కారణంగా ఉద్యోగులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ అంశాన్ని ప్రభుత్వం సమీక్షించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.ఏళ్ల తరబడి సేవలందిస్తున్న కాంట్రాక్ట్‌ ఉద్యోగుల కుటుంబాల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని, ఉద్యోగ భద్రత కల్పించేలా చర్యలు తీసుకోవాలని జేఏసీ నాయకులు కోరారు. సమస్యలను పరిష్కరించకపోతే భవిష్యత్‌లో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు.