BREAKING
అంబ భవాని నవరాత్రి ఉత్సవాలకు ప్రముఖులకు ఆహ్వానం పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం - మండల స్పెషల్ ఆఫీసర్ ఆర్తమురులో మీ భూమి మీ హక్కు కార్యక్రమం తెలంగాణ స్టడీ సర్కిల్ లో ఎస్సై పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ కొరకు ఉచిత శిక్షణ; :ఎస్సీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ జి జ్యోతి సీసీ రోడ్డు నిర్మాణం ప్రారంభించిన ఎంపీ, ఎమ్మెల్యే బోయినపల్లి మండల ప్రజావాణిలో 2 అర్జీలు.. ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వద్దు,- పోలీసు అధికారులకు జిల్లా ఏఎస్పీ వెంకటాద్రి ఆదేశం గోదావరి పుష్కరాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలి 11 నుండి 20 వరకు దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలను ప్రజా సమస్యల పరిష్కారంలో నాణ్యత, సకాలంలో పరిష్కారమే లక్ష్యం - జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ ఎల్బండ సచివాలయంలో ఘనంగా 'పోషణ్ మా' ఉత్సవాలు నాటి కేసీఆర్ సంకల్పమే.. నేటి కల్యాణ లక్ష్మి* గ్రాండ్ ఎస్ ఎల్ ఎన్ లాడ్జ్ డీలక్స్ ప్రారంభించిన ఎమ్మెల్యే పల్లా ప్రజావాణిలో ఫిర్యాదులు స్వీకరించిన ఎస్పీ స్నేహ మెహ్రా పిజిఆర్‌ఎస్, రెవిన్యూ క్లినిక్లు ద్వారా స్వీకరించిన అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపాలి దివ్యాంగులు చెంతకు వెళ్ళి అర్జీలను స్వీకరించి, వారికి భరోసానిచ్చిన జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి

ప్రజా సమస్యల పరిష్కారం కోసం రేపు కలెక్టరేట్‌ ఎదుట నిరసన

Select Suryaa Now
ప్రజా సమస్యల పరిష్కారం కోసం రేపు కలెక్టరేట్‌ ఎదుట నిరసన

మేడ్చల్‌లో కాంగ్రెస్‌ భారీ మార్చ్‌.. వజ్రేష్‌ యాదవ్‌ పిలుపు
ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీలతో కలిసి కార్యక్రమం

మేడ్చల్‌ జిల్లా ప్రతినిధి, మేజర్‌ న్యూస్‌( అక్టోబర్‌ 05): ప్రజా సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టిని ఆకర్షించడంతో పాటు వాటి పరిష్కారం కోసం ఏఐసీసీ, టీపీసీసీ పిలుపు మేరకు అక్టోబర్‌ 6న మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో భారీ మార్చ్‌, నిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు, మేడ్చల్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి తోటకూర వజ్రేష్‌ యాదవ్‌ తెలిపారు.తెలంగాణలోని అన్ని జిల్లా కేంద్రాల్లో ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీలతో కలిసి భారీ మార్చ్‌లు నిర్వహించి, కలెక్టరేట్ల ఎదుట నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించిన నేపథ్యంలో మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లాలోనూ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కాంగ్రెస్‌ శ్రేణులు సన్నద్ధమవుతున్నాయని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్‌చార్జిలు, జిల్లా కాంగ్రెస్‌ కమిటీ సభ్యులు, డివిజన్‌ అధ్యక్షులు, యూత్‌ కాంగ్రెస్‌, మహిళా కాంగ్రెస్‌, ఎస్సీ, బీసీ, మైనారిటీ సెల్‌ల నాయకులు, ఇతర అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు, ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీల శ్రేణులు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వజ్రేష్‌ యాదవ్‌ పిలుపునిచ్చారు.ప్రజా సమస్యలపై ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావడంతో పాటు ప్రజల గొంతుకను బలంగా వినిపించేందుకు ప్రతి కాంగ్రెస్‌ కార్యకర్త ఈ కార్యక్రమాన్ని బాధ్యతగా భావించి తప్పనిసరిగా పాల్గొనాలని ఆయన కోరారు.

పన్నాల బాల్ రెడ్డి, మేడ్చల్ జిల్లా ప్రతినిధి.