దాయాదిపై దాడికి పాల్పడిన ఘటనలో మాజీ జెడ్పిటిసి శ్రీశైలం పై కేసు నమోదు ,అరెస్ట్ -నాగర్ కర్నూల్ ఎస్సై వెంకట్ రెడ్డి
దాయాదిపై దాడికి పాల్పడిన ఘటనలో మాజీ జెడ్పిటిసి శ్రీశైలం పై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు ఎస్సై వెంకట్ రెడ్డి సోమవారం తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం ఈనెల 3న పెద్ద ముద్దునూరు గ్రామానికి చెందిన చిక్కొండ్ర సైదయ్య తన భార్యతో కలిసి పొలానికి వెళ్లి తిరిగి వస్తుండగా అదే గ్రామానికి చెందిన మాజీ జెడ్పిటిసి చిక్కొండ్ర శ్రీశైలంతో పాటు సుమశ్రీ, మమత, మల్లేష్ లు , చిక్కొండ్ర సైదయ్య పై దాడికి పాల్పడడంతో తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. కాగా ఇదే ఘటనలో చిక్కొండ్ర సైదయ్య తన మినుముల పొలాన్ని ఉద్దేశపూర్వకంగానే పశువులతో మేపించి నష్టపరిచారని అడగడంతో అతడు తనపై దాడికి పాల్పడినట్లు చిక్కొండ్ర మల్లేష్ ఫిర్యాదు చేయడంతో చిక్కొండ్ర సైదయ్య పై కూడా కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
పి. వినయ్ కుమార్, నాగర్ కర్నూల్ క్రైమ్, సూర్య న్యూస్