హైవే లో రోడ్డు ప్రమాదం.. ఒకరికి తీవ్రగాయాలు.
హైవే లో రోడ్డు ప్రమాదం.. ఒకరికి తీవ్రగాయాలు.
రొంపిచర్ల, అక్టోబర్ 05, మేజర్ న్యూస్: తిరుపతి- మదనపల్లి హైవేలో రొంపిచెర్ల మండల మోడల్ వద్ద స్కూటర్ అదుపు తప్పి ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. పీలేరు నుంచి తిరుపతి వైపుకు వెళుతున్న చిత్తూరుకు చెందిన తేజస్ (30) స్కూటర్ అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు 108 కు సమాచారం అందించారు. దీంతో అతనిని రొంపిచర్ల 108 సిబ్బంది 108 వాహనంలో పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.