భూమి పూజకు ముస్తాబైన ప్రాంగణం తూప్రాన్‌లో సాబర్ డైరీ తెలంగాణ ప్రాజెక్టుకు భూమి పూజ
భూమి పూజకు ముస్తాబైన ప్రాంగణం
తూప్రాన్‌లో సాబర్ డైరీ తెలంగాణ ప్రాజెక్టుకు భూమి పూజ
మెదక్ ; మెదక్ జిల్లా తూప్రాన్ మండలం బ్రాహ్మణపల్లి గ్రామ పరిధిలో నూతనంగా నిర్మించనున్న సాబర్ డైరీ తెలంగాణ ప్రాజెక్టు భూమి పూజ కార్యక్రమానికి ప్రాంగణం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది.ఈ భూమి పూజ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ, సహకార శాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్, మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు, రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు, ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి తదితరులు పాల్గొననున్నారు.కార్యక్రమంలో కేంద్ర మంత్రి అమిత్ షా వర్చువల్‌గా పాల్గొని భూమి పూజ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.ప్రతిష్టాత్మకమైన ఈ ప్రాజెక్టు ఏర్పాటుతో తూప్రాన్ ప్రాంతంలో పారిశ్రామిక, ఆర్థిక కార్యకలాపాలకు మరింత ఊతం లభించే అవకాశం ఉందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.