చీపురుపల్లి, గుర్ల, గరివిడి మండలాల నుంచి టీడీపీలోకి భారీగా చేరికలు
చీపురుపల్లి మేజర్ న్యూస్:
జడ్పీ మాజీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు బాటలో నడిచేందుకు చీపురుపల్లి, గుర్ల, గరివిడి మండలాల భారీ సంఖ్యలో అభిమానులు ముందుకు వస్తున్నారు. చిన్న శ్రీనుకి చెందిన స్థానిక కార్యాలయంలో ఆదివారం టీడీపీ నాయకులు వలిరెడ్డి శ్రీనివాస నాయుడు, మెరకముడిదాం నాయకులు కోట్ల వెంకటరావు, బుర్లె నరేష్ ఆధ్వర్యంలో చీపురుపల్లి మండల దేవరపొదిలం గ్రామానికి చెందిన పీఏసీఎస్ మాజీ అధ్యక్షుడు పెద్ది గోవిందరావు ఆధ్వర్యంలో అక్కడి పంచాయతీ వార్డు మాజీ సభ్యులు గొల్లాజీ, అచ్యుతరావు, అప్పారావు లతో సుమారు 50 కుటుంబాలు, గుర్ల మండలంలోని గుజ్జంగివలస గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ అప్పలనర్సయ్య, మాజీ ఎంపీటీసీ అట్టడ అప్పలరాజు తో సహా సుమారు 30 కుటుంబాలు, చోడవరం గ్రామంలో 30 కుటుంబాలు, జమ్ము లో 20 కుటుంబాలు, సదానందపురం, పోలాయవలస గ్రామాలకు చెందినవారు చిన్న శ్రీను వెంటే నడుస్తున్నామన్నారు. అలాగే గరివిడి మండలంలో కుమరాం గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ శ్రీదేవి, కుమార్ లతో సుమారు 80 కుటుంబాలు వైసీపీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. తామంతా చిన్న శ్రీను వెంటే టీడీపీ లో చేరుతున్నారని పేర్కొన్నారు.