BREAKING
సుకుమార్ శిష్యుడిగా మారడం కోసం మూడేళ్లు వేచి చూశా: డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల ఆసక్తికర వ్యాఖ్యలు ప్రచురణార్థం — Tirupati 04.10.2026 పారిశ్రామిక ప్రమాదాల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలి శ్రీసిటీలోని టిల్‌ ఫార్మా పరిశ్రమను జనావాసాలకు దూరంగా తరలించాలి మృతుల కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం చెల్లించాలి: సీఐటీయూ రౌండ్‌టేబుల్‌ సమావేశం డిమాండ్‌ తిరుపతి: సత్యవేడు శ్రీసిటీ పరిధిలోని టిల్‌ హెల్త్‌ రామగిరి గంగమ్మ దేవాలయంలో కోనంకి గంగారమ్ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం.. బాక్సాఫీస్ వద్ద దారుణంగా నిరాశపరిచిన జేసన్ సంజయ్ 'సిగ్మా'.. తొలి రెండు రోజుల్లో కలెక్షన్లు ఎంతంటే? శ్రీవారి పుష్కరిణి తీర్థ ప్రాశస్త్యం బాలీవుడ్‌లో సరికొత్త రికార్డ్: షారుఖ్, అమితాబ్‌లను వెనక్కి నెట్టి నంబర్ వన్ స్థానంలో నిలిచిన భూషణ్ కుమార్ నంద్యాల మూడవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్- సీఐ వేణుగోపాల్ పిజిఆర్ఎస్ ను సద్వినియోగం చేసుకోండి సోమవారం జరిగే గ్రీవెన్స్ ను జయప్రదం చేయండి జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ వెల్లడి వెంకీ-త్రివిక్రమ్ 'ఆదర్శ కుటుంబం' సినిమాపై ఎందుకంత సైలెన్స్? బజ్ తగ్గడానికి అసలు కారణాలు ఇవే! కార్పొరేషన్ లో గెలుపే లక్ష్యం కావాలి -తిరుపతిలో బిజెపికి పట్టు బిగించే వ్యూహం నార్త్ మండలంలో బలప్రదర్శన - ఎన్డీఏ కూటమి ఐక్యతతో ముందుకు ఉక్రెయిన్‌కు జర్మనీ భారీ మద్దతు.. డ్రోన్ ఒప్పందం ఖరారు అమెరికా సుప్రీంకోర్టులో వాతావరణ మార్పుల వ్యాజ్యాలను కొట్టేయాలని కోరుతున్న బిగ్ ఆయిల్ కంపెనీలు బ్రెజిల్‌లో పోలింగ్ కేంద్రాలకు పోటెత్తిన ఓటర్లు వర్టికల్ రోలర్‌‌కోస్టర్‌లా పడిపోయిన ఫ్లైదుబాయ్ విమానం ఎఫ్‌జెడ్1073

వ్యభిచార ముఠా గుట్టురట్టు -శ్రీనివాస గెస్ట్ హౌస్ పై పోలీసుల మెరుపు దాడి -మేనేజర్ సహా ముగ్గురు అరెస్ట్ - రూ.28 వేలు స్వాధీనం -శ్రీనివాస గెస్ట్ హౌస్ మూసివేతకు ఆర్డీవోకు లేఖ

Select Suryaa Now
వ్యభిచార ముఠా గుట్టురట్టు -శ్రీనివాస గెస్ట్ హౌస్ పై పోలీసుల మెరుపు దాడి -మేనేజర్ సహా ముగ్గురు అరెస్ట్ - రూ.28 వేలు స్వాధీనం -శ్రీనివాస గెస్ట్ హౌస్ మూసివేతకు ఆర్డీవోకు లేఖ

అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు హెచ్చరించారు. ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. అలిపిరి పోలీసులు శుక్రవారం రాత్రి శివజ్యోతి నగర్ లోని శ్రీనివాస గెస్ట్ హౌస్ పై దాడి చేసి వ్యభిచార కార్యకలాపాలను బట్టబయలు చేశారు.విశ్వసనీయ సమాచారంతో సబ్ డివిజన్ పోలీసు అధికారి అనుమతితో తనిఖీలు నిర్వహించగా, మొదటి అంతస్తులోని మూడు గదుల్లో అనుమానాస్పదంగా ఉన్న ముగ్గురు పురుషులు, నలుగురు మహిళలను గుర్తించారు. గెస్ట్ హౌస్ మేనేజర్ శంకర్ 37, చింత కదిరయ్య 35, సుంకర లక్ష్మీపతి 29, మాదిరి హరి 31 పోలీసులు అరెస్టు చేశారు.ఈ సందర్భంగా చేపట్టిన విచారణలో మేనేజర్ వివిధ ప్రాంతాల నుంచి మహిళలను తీసుకొచ్చి వ్యభిచారానికి అవకాశం కల్పిస్తూ విటుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు తేలింది. ఘటనా స్థలంలో రూ.28,000 నగదు (మేనేజర్ వద్ద రూ.22,000, విటుల వద్ద రూ.6,000) స్వాధీనం చేసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మహిళలను బాధితులుగా గుర్తించి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ కేసులో సంతోషి లక్ష్మీకాంతం పాత్రపై కూడా దర్యాప్తు జరుగుతోంది. వ్యభిచారానికి వేదికగా మారిన శ్రీనివాస గెస్ట్ హౌస్ ను మూసివేయాలని ఆర్డీవోకు లేఖ రాయనున్నట్లు అలిపిరి పోలీసులు తెలిపారు. ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలపై సమాచారం ఉంటే 112కు తెలియజేయాలని ప్రజలకు సూచించారు.

సీఎం గౌడ్ తిరుపతి ప్రతినిధి