సోమవారం జరిగే గ్రీవెన్స్ ను జయప్రదం చేయండి జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ వెల్లడి
బాపట్ల, మేజర్ న్యూస్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక, రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ క్లినిక్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ లోని పి జి ఆర్ ఎస్ హల్ నందు ఉదయం 9 గంటల నుండి 10 గంటలవరకు గతం లో పి జి ఆర్ ఎస్ కు వచ్చిన అర్జీల పరిష్కరం పై వివిధ శాఖల జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించడం జరుగుతుందని, అనంతరం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజల నుంచి సమస్యల అర్జీలను స్వీకరించడం జరుగుతుందని తెలిపారు.