BREAKING
సి.ఎస్.ఐ బేతేలు ఆశ్రమంలో కోడూరి మల్లేశం వర్ధంతి వేడుకలు సోను లేడీస్ ఎంపోరియంలో అనుమతులు లేకుండా విటమిన్ సబ్బు విక్రయం సుకుమార్ శిష్యుడిగా మారడం కోసం మూడేళ్లు వేచి చూశా: డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల ఆసక్తికర వ్యాఖ్యలు ప్రచురణార్థం — Tirupati 04.10.2026 పారిశ్రామిక ప్రమాదాల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలి శ్రీసిటీలోని టిల్‌ ఫార్మా పరిశ్రమను జనావాసాలకు దూరంగా తరలించాలి మృతుల కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం చెల్లించాలి: సీఐటీయూ రౌండ్‌టేబుల్‌ సమావేశం డిమాండ్‌ తిరుపతి: సత్యవేడు శ్రీసిటీ పరిధిలోని టిల్‌ హెల్త్‌ రామగిరి గంగమ్మ దేవాలయంలో కోనంకి గంగారమ్ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం.. బాక్సాఫీస్ వద్ద దారుణంగా నిరాశపరిచిన జేసన్ సంజయ్ 'సిగ్మా'.. తొలి రెండు రోజుల్లో కలెక్షన్లు ఎంతంటే? శ్రీవారి పుష్కరిణి తీర్థ ప్రాశస్త్యం బాలీవుడ్‌లో సరికొత్త రికార్డ్: షారుఖ్, అమితాబ్‌లను వెనక్కి నెట్టి నంబర్ వన్ స్థానంలో నిలిచిన భూషణ్ కుమార్ నంద్యాల మూడవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్- సీఐ వేణుగోపాల్ పిజిఆర్ఎస్ ను సద్వినియోగం చేసుకోండి సోమవారం జరిగే గ్రీవెన్స్ ను జయప్రదం చేయండి జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ వెల్లడి వెంకీ-త్రివిక్రమ్ 'ఆదర్శ కుటుంబం' సినిమాపై ఎందుకంత సైలెన్స్? బజ్ తగ్గడానికి అసలు కారణాలు ఇవే! కార్పొరేషన్ లో గెలుపే లక్ష్యం కావాలి -తిరుపతిలో బిజెపికి పట్టు బిగించే వ్యూహం నార్త్ మండలంలో బలప్రదర్శన - ఎన్డీఏ కూటమి ఐక్యతతో ముందుకు ఉక్రెయిన్‌కు జర్మనీ భారీ మద్దతు.. డ్రోన్ ఒప్పందం ఖరారు అమెరికా సుప్రీంకోర్టులో వాతావరణ మార్పుల వ్యాజ్యాలను కొట్టేయాలని కోరుతున్న బిగ్ ఆయిల్ కంపెనీలు

గ్రామీణ గృహనిర్మాణంలో నూతన శకం: బుర్రిపాలెంలో 3డీ కాంక్రీట్ ఇళ్లకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన

Select Suryaa Now
గ్రామీణ గృహనిర్మాణంలో నూతన శకం: బుర్రిపాలెంలో 3డీ కాంక్రీట్ ఇళ్లకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన

గుంటూరు, సూర్య ప్రతినిధి :గుంటూరు జిల్లా బుర్రిపాలెంలో గ్రామీణ గృహనిర్మాణ రంగానికి సంబంధించి ఒక చారిత్రాత్మక ఘట్టం చోటుచేసుకుంది. దేశంలోనే తొలిసారిగా గ్రామీణ ప్రాంతాల్లో 3డీ కాంక్రీట్ ప్రింటింగ్ సాంకేతికతతో నిర్మించే ఇళ్లకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకమైన పీఎంఏవై-గ్రామీణ్ (PMAY-G) కింద పైలట్ ప్రాజెక్ట్‌గా చేపట్టిన ఈ ప్రాజెక్ట్ ద్వారా బుర్రిపాలెం మరియు ఓబులనాయుడుపాలెంలో రూ. 14 కోట్ల అంచనా వ్యయంతో మొత్తం 117 3డీ కాంక్రీట్ ఇళ్లను నిర్మించనున్నారు. ఈ నిర్మాణాలకు కేంద్ర ప్రభుత్వం రూ. 9.44 కోట్లు అందిస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం రూ. 4.49 కోట్ల నిధులను వెచ్చిస్తోంది.

ఈ నూతన సాంకేతికతలో భాగంగా ప్రత్యేకమైన 3డీ ప్రింటర్ సహాయంతో కాంక్రీట్ మిశ్రమాన్ని పొరలుపొరలుగా (layer-by-layer) పేర్చుకుంటూ గోడలను నిర్మిస్తారు. డిజిటల్ డిజైన్ల ఆధారంగా కావలసిన ఆకృతిలో పటిష్టమైన గోడలను తయారుచేసుకునే వెసులుబాటు ఈ టెక్నాలజీ ద్వారా లభిస్తుంది. దీనివల్ల సాంప్రదాయ నిర్మాణ పద్ధతులతో పోలిస్తే సమయంతో పాటు నిర్మాణ వ్యయం కూడా గణనీయంగా తగ్గుతుంది. నాణ్యమైన, ఆధునికమైన ఇళ్లను పేదలకు వేగంగా అందుబాటులోకి తెచ్చేందుకు ఈ సాంకేతికత ఎంతగానో ఉపయోగపడనుంది.