ఆశా వర్కర్ దరఖాస్తుదారులకు ముగిసిన ఇంటర్వ్యూలు
ఖాజీపేట మేజర్ న్యూస్
మండల పరిధిలోని నాగసానిపల్లె గ్రామంలో ఖాళీగా ఉ న్న ఆశవర్కర్ ఉద్యోగానికి శనివారం ఇంటర్వ్యూలు జరిగాయి. ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో అడిషనల్ డీఎంహెచ్వోమల్లేసు ఇంటర్వ్యూలు నిర్వహించారు. అర్హతకు కావాల్సిన వివరాలను వారు పరిశీలించారు. అనంతరం అప్లికేషన్లను జిల్లా అధికారుల ఆధ్వర్యంలో ఎంపిక చేయబడతాయన్నారు. ఈ కార్యక్రమంలో మండల తహశీల్దార్ క్రాంతి కుమార్, ప్రాధమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్లు డాక్టర్ ఇళయరాణి, డాక్టర్ ముబీన, సెల్సెహెల్ప్ గ్రూపు ప్రెసిడెంట్ జయసుప్రియ, అంగన్వాడి అంజనాదేవి, సూపర్వైజర్లు క్రిష్ణప్రియ, శోభన్ బాబు, సిహెచి, ల్యాబ్ టెక్నీషియన్, ఎఎన్ఎమ్, సిబ్బంది పాల్గొన్నారు.