BREAKING
బాక్సాఫీస్ వద్ద దారుణంగా నిరాశపరిచిన జేసన్ సంజయ్ 'సిగ్మా'.. తొలి రెండు రోజుల్లో కలెక్షన్లు ఎంతంటే? శ్రీవారి పుష్కరిణి తీర్థ ప్రాశస్త్యం బాలీవుడ్‌లో సరికొత్త రికార్డ్: షారుఖ్, అమితాబ్‌లను వెనక్కి నెట్టి నంబర్ వన్ స్థానంలో నిలిచిన భూషణ్ కుమార్ నంద్యాల మూడవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్- సీఐ వేణుగోపాల్ పిజిఆర్ఎస్ ను సద్వినియోగం చేసుకోండి సోమవారం జరిగే గ్రీవెన్స్ ను జయప్రదం చేయండి జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ వెల్లడి వెంకీ-త్రివిక్రమ్ 'ఆదర్శ కుటుంబం' సినిమాపై ఎందుకంత సైలెన్స్? బజ్ తగ్గడానికి అసలు కారణాలు ఇవే! కార్పొరేషన్ లో గెలుపే లక్ష్యం కావాలి -తిరుపతిలో బిజెపికి పట్టు బిగించే వ్యూహం నార్త్ మండలంలో బలప్రదర్శన - ఎన్డీఏ కూటమి ఐక్యతతో ముందుకు ఉక్రెయిన్‌కు జర్మనీ భారీ మద్దతు.. డ్రోన్ ఒప్పందం ఖరారు అమెరికా సుప్రీంకోర్టులో వాతావరణ మార్పుల వ్యాజ్యాలను కొట్టేయాలని కోరుతున్న బిగ్ ఆయిల్ కంపెనీలు బ్రెజిల్‌లో పోలింగ్ కేంద్రాలకు పోటెత్తిన ఓటర్లు వర్టికల్ రోలర్‌‌కోస్టర్‌లా పడిపోయిన ఫ్లైదుబాయ్ విమానం ఎఫ్‌జెడ్1073 విద్యార్థుల సంక్షేమానికి కృషి చేస్తాం ఫిలిప్పీన్స్ సముద్ర జలాల్లో ఉద్రిక్తత స్పెయిన్‌లో భీకర వర్షాలు, వరద బీభత్సం

మదనపల్లెలో జాతీయ రక్తదాన దినోత్సవ వారోత్సవాలు

Select Suryaa Now
మదనపల్లెలో జాతీయ రక్తదాన దినోత్సవ వారోత్సవాలు

 

- హెల్పింగ్ మైండ్స్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం 
మదనపల్లె : జాతీయ రక్తదాన దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా హెల్పింగ్ మైండ్స్ ఆధ్వర్యంలో ఆదివారం మదనపల్లి వాలంటరీ బ్లడ్ బ్యాంక్ నందు రక్తదాన శిబిరం నిర్వహించారు.రక్తదాన శిబిరంలో పలువురు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేశారు.ఈ సందర్భంగా హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబక్కర్ సిద్దిక్ మాట్లాడుతూ రక్తదానం చేయడానికి కావలసింది కేవలం మూడు నిమిషాలు మాత్రమే,రక్తదానం చేస్తే ప్రాణదాతలు అవ్వడంతో పాటు ఆరోగ్యంగా కూడా ఉంటామని తెలిపారు.14 ఏళ్ల నుండి రక్తదాన ఉద్యమంలో ముఖ్యపాత్ర పోషిస్తూ రక్తదాన శిబిరాలు,రక్తదాన అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ తమ సంస్థ సేవలు ముందుకు వెళ్తున్నాయని,ప్రతినెల రక్తదాన శిబిరం కూడా నిర్వహిస్తున్నామని అందులో భాగంగా ఈ రక్తదాన శిబిరంలో రక్తదానం చేసిన రక్తదాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో హెల్పింగ్ మైండ్స్ సభ్యులు మోహన్,అల్తాఫ్,పెరవలి మధు,ఫరీద్ హుస్సేన్,పృధ్వీరాజ్,సాంబ,రిజ్వాన్,అమీన్,సమీర్ పాల్గొన్నారు.