BREAKING
కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శికి సన్మానం దివ్యాంగులకు లాయర్ కరుణాకర్ రెడ్డి చేయూత సింగీతం శ్రీనివాసరావు ఇక లేరనే వార్త బాధాకరం: జూ. ఎన్టీఆర్‌ మద్దయ్య యాదవ్ ను సన్మానించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి దసరా ఉత్సవాల ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ జగన్ నోరు తెరిస్తే అబద్ధాలు… రాయలసీమ అభివృద్ధిపైనా విషప్రచారమేనా? : వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు శ్రీనారాయణస్వామి దేవస్థానంలో విశేషపూజలు వైఎస్సార్సిపిలో కార్యకర్తల సంక్షేమానికి తొలి ప్రాధాన్యత 5 న చిల్లర గొల్లపాలెం నందు ఏఎన్‌జీఆర్‌ఏయూ నూతన కేంద్రాల ప్రారంభం పక్షవాతంతో బాధపడుతున్న టీడీపీ కార్యకర్తకు ఎమ్మెల్యే అమిలినేని రూ.50 వేల ఆర్థిక సాయం కుందూ నది వద్ద టాక్టర్, లారీ బోల్తా మున్సిపల్ ఎన్నికల్లో కూటమి విజయమే ధ్యేయం బీటెక్ రవి రూ.3.14 కోట్లతో నిర్మించిన రహదారి ప్రారంభం విట్లంపల్లి ప్రజలకు రోడ్డును అంకితం చేసిన ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు తదుపరి తరం జీఎస్టీ: వికసిత్ భారత్ దిశగా మరో మైలురాయి శ్రీమతి నిర్మల సీతారామన్ హ్యూమా ఖురేషి 'బేబీ డూ డై డూ' రివ్యూ: నెట్‌ఫ్లిక్స్‌లో ట్రెండవుతున్న ఉత్కంఠభరిత క్రైమ్ థ్రిల్లర్

జిల్లా వ్యాప్తంగా ఆపరేషన్ త్రిశూల్ -బీఎన్ కండ్రిగలో పోలీసులు కార్డన్ సెర్చ్ -పత్రాలు లేని 7 ద్విచక్ర వాహనాలు స్వాధీనం

Select Suryaa Now
జిల్లా వ్యాప్తంగా ఆపరేషన్ త్రిశూల్ -బీఎన్ కండ్రిగలో పోలీసులు కార్డన్ సెర్చ్ -పత్రాలు లేని 7 ద్విచక్ర వాహనాలు స్వాధీనం

జిల్లాలో నేర నియంత్రణకు తిరుపతి జిల్లా పోలీసులు చేపట్టిన 'ఆపరేషన్ త్రిశూల్' లో భాగంగా బీఎన్ కండ్రిగ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్‌లో ఆదివారం ఉదయం పోలీసులు విస్తృతంగా కార్డన్ & సెర్చ్ నిర్వహించారు.జిల్లా ఎస్పీ ఎల్.సుబ్బరాయుడు ఆదేశాల మేరకు శ్రీకాళహస్తి సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో ఈ తనిఖీలు జరిగాయి. పోలీసు బృందాలు ఎన్టీఆర్ నగర్ ప్రాంతాన్ని చుట్టుముట్టి అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా 43 ద్విచక్ర వాహనాలను పరిశీలించగా, ఎలాంటి పత్రాలు లేని 7 వాహనాలను గుర్తించి బీఎన్ కండ్రిగ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వాటి యాజమాన్య వివరాలపై ఆరా తీస్తున్నారు. అదేవిధంగా స్థానిక ప్రజలకు మహిళల భద్రత, మాదకద్రవ్యాల నిర్మూలన, రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. వాహనదారులు ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ పత్రాలు తప్పనిసరిగా కలిగి ఉండాలని, రికార్డులు లేని వాహనాలను కొనుగోలు చేయవద్దని సూచించారు. అనుమానాస్పద కార్యకలాపాలు గుర్తిస్తే డయల్ 112కు సమాచారం ఇవ్వాలని కోరారు.

సీఎం గౌడ్ తిరుపతి ప్రతినిధి