BREAKING
ఎస్ డబ్ల్యూ యూ నూతన యూనియన్ కమిటీ ముంబైకి గుడ్‌బై చెప్పనున్న ప్రముఖ జంట: సొంతూరికి మకాం మార్చనున్న డైరెక్టర్ ఆదిత్య ధర్, యామీ గౌతమ్ వెంకటేష్ చిత్రాల పాటలతో అలరించిన సంగీత సత్సంగం దుక్కి దున్నుతూ ట్రాక్టర్ కిందపడి డ్రైవర్ మృతి. సి.ఎస్.ఐ బేతేలు ఆశ్రమంలో కోడూరి మల్లేశం వర్ధంతి వేడుకలు సోను లేడీస్ ఎంపోరియంలో అనుమతులు లేకుండా విటమిన్ సబ్బు విక్రయం సుకుమార్ శిష్యుడిగా మారడం కోసం మూడేళ్లు వేచి చూశా: డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల ఆసక్తికర వ్యాఖ్యలు ప్రచురణార్థం — Tirupati 04.10.2026 పారిశ్రామిక ప్రమాదాల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలి శ్రీసిటీలోని టిల్‌ ఫార్మా పరిశ్రమను జనావాసాలకు దూరంగా తరలించాలి మృతుల కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం చెల్లించాలి: సీఐటీయూ రౌండ్‌టేబుల్‌ సమావేశం డిమాండ్‌ తిరుపతి: సత్యవేడు శ్రీసిటీ పరిధిలోని టిల్‌ హెల్త్‌ రామగిరి గంగమ్మ దేవాలయంలో కోనంకి గంగారమ్ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం.. బాక్సాఫీస్ వద్ద దారుణంగా నిరాశపరిచిన జేసన్ సంజయ్ 'సిగ్మా'.. తొలి రెండు రోజుల్లో కలెక్షన్లు ఎంతంటే? శ్రీవారి పుష్కరిణి తీర్థ ప్రాశస్త్యం బాలీవుడ్‌లో సరికొత్త రికార్డ్: షారుఖ్, అమితాబ్‌లను వెనక్కి నెట్టి నంబర్ వన్ స్థానంలో నిలిచిన భూషణ్ కుమార్ నంద్యాల మూడవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్- సీఐ వేణుగోపాల్ పిజిఆర్ఎస్ ను సద్వినియోగం చేసుకోండి సోమవారం జరిగే గ్రీవెన్స్ ను జయప్రదం చేయండి జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ వెల్లడి

నిబంధనలో పాటించని నిర్మాణాలపై కఠిన చర్యలు

Select Suryaa Now
నిబంధనలో పాటించని నిర్మాణాలపై కఠిన చర్యలు

నగరపాలక సంస్థ పరిధిలో పట్టణ ప్రణాళిక నిబంధనలు పాటించకుండా జరుగుతున్న నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎం.జయకృష్ణ టౌన్ ప్లానింగ్ అధికారులు ఆదేశించారు.

ఆదివారం ఉదయం నగరంలోని పలు ప్రాంతాల్లో జరుగుతున్న భవన నిర్మాణ పనులను పట్టణ ప్రణాళిక విభాగం అధికారులతో కలసి కమిషనర్ పరిశీలించారు. నగరంలో జరుగుతున్న భవన నిర్మాణాలను అధికారులు సిబ్బందితో కలసి పరిశీలించాలని తెలిపారు. పట్టణ ప్రణాళిక విభాగం అనుమతులు ఉన్నాయా? నిబంధనల మేరకు పనులు జరుగుతున్నాయా? అనే విషయాలను అధికారులు తనిఖీ చేస్తూ ఉండాలని తెలిపారు. ఎవరైనా అనుమతులు లేకుండా, నిబంధనలు పాటించకుండా నిర్మాణాలు చేపడితే వెంటనే వారిపై కఠిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నిబంధనలు పాటించకుండా ఏవైనా నిర్మాణాలు జరిగినట్లు తన దృష్టికి వస్తే సంబంధిత అధికారులు, సిబ్బందిపై శాఖపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కమిషనర్ వెంట ఇంచార్జి డిసిపీ మూర్తి, టిఫివో వంశీ, టౌన్ ప్లానింగ్ సెక్రటరీలు ఉన్నారు.

సీఎం గౌడ్ తిరుపతి ప్రతినిధి