దుక్కి దున్నుతూ ట్రాక్టర్ కిందపడి డ్రైవర్ మృతి.
ప్రకాశంజిల్లా అద్దంకి మండలం ధేనువకొండకు చెందిన వేణు ట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం తెల్లవారుజామున ఇలపావులూరుకి చెందిన పొలంలో గొర్రు తోలకడానికి వెళ్లాడు. ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటన జరిగిన సమయంలో పొలంలోను మరియు చుట్టు ప్రక్కల ఎవరూ లేకపోవడంతో ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై స్పష్టత లేదని స్థానికులు తెలిపారు. వేణు మృతితో ధేనువకొండ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.