శానిటరీ విభాగంలో ఉత్తమ సేవలకు కందుల బాలమ్మకు “బెస్ట్ ఎంప్లాయ్” అవార్డు
జగ్గయ్యపేట, అక్టోబర్ 05 మేజర్ న్యూస్::జగ్గయ్యపేట మున్సిపాలిటీ శానిటరీ విభాగంలో శానిటరీ వర్కర్‌గా విధులు నిర్వహిస్తున్న కందుల బాలమ్మ ఉత్తమ సేవలకు గుర్తింపుగా “బెస్ట్ ఎంప్లాయ్” అవార్డును అందుకున్నారు.
విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన జిల్లా స్థాయి అవార్డుల కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీషా చేతుల మీదుగా కందుల బాలమ్మ ఈ అవార్డును స్వీకరించారు.
మున్సిపాలిటీ పరిధిలో పారిశుధ్య పరిరక్షణ, ప్రజారోగ్య పరిరక్షణ, పరిసరాల పరిశుభ్రత కోసం కందుల బాలమ్మ అందిస్తున్న సేవలను గుర్తించి ఈ అవార్డుకు ఎంపిక చేయడం జరిగింది. విధుల పట్ల అంకితభావంతో, బాధ్యతాయుతంగా పనిచేస్తూ ప్రజలకు మెరుగైన పారిశుధ్య సేవలు అందించడంలో ఆమె చేస్తున్న కృషి అభినందనీయమని అధికారులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జగ్గయ్యపేట మున్సిపల్ కమిషనర్ పి.వి.వి.డి. ప్రసాద్ రావు, శానిటరీ ఇన్స్పెక్టర్ వి. నాగరాజు గారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అవార్డు అందుకున్న కందుల బాలమ్మను మున్సిపల్ అధికారులు, శానిటరీ సిబ్బంది అభినందించారు. పారిశుధ్య కార్మికుల సేవలను గుర్తించి ప్రోత్సహించడం ద్వారా మరింత ఉత్సాహంతో ప్రజలకు సేవలందించేలా చేయవచ్చని అధికారులు తెలిపారు.