ఎస్ డబ్ల్యూ యూ నూతన యూనియన్ కమిటీ
సూర్య మంచిర్యాల టౌన్ : ఎస్ డబ్ల్యూ యూ ఐ ఎన్ టీ యూ సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్కుల మల్లేశం ఆదేశాల మేరకు ఆదిలాబాద్ రీజియన్‌కు నూతన ప్రాంతీయ యూనియన్ కమిటీని ఏర్పాటు చేశారు.సెప్టెంబర్ 26న ఆదిలాబాద్‌లో నిర్వహించిన ప్రాంతీయ సమావేశంలో కమిటీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు వెల్లడించారు.నూతన కమిటీలో ప్రాంతీయ అధ్యక్షుడిగా జి. విష్ణు, ప్రాంతీయ కార్యదర్శిగా వి.బి. రావు, కోశాధికారిగా ఎస్. సమ్మయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎం. మల్లేష్, ఉపాధ్యక్షుడిగా ఎం. కేశవ్, జాయింట్ సెక్రటరీగా హెచ్. సంతోష్ ఎన్నికయ్యారు. కార్మికుల సమస్యలు, ఫిర్యాదులను పరిష్కరించేందుకు నూతన కమిటీ కృషి చేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్కుల మల్లేశం సూచించినట్లు తెలిపారు. కార్మికుల సమస్యల పరిష్కారంలో కమిటీ సభ్యులకు సహకరించాలని సంబంధిత అధికారులను కోరారు.